మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకున్న జాతీయ మహిళ కమిషన్ శ్యామలకుందా

కర్నూలు జిల్లా మంత్రాలయంలో రాఘవేంద్రస్వామి సన్నిధిలో జాతీయ మహిళ కమిషన్ శ్యామలకుందా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకునేందుకు జాతీయ మహిళ కమిషన్ శ్యామలకుందా కుటుంబ సమేతంగా గురువారం వచ్చారు. వీరికి బీజేపీ. నాయకులు స్వాగతం పలికారు. అనంతరం శ్రీమఠానికి చేరుకున్న వారు మఠం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్ర తీర్థుల పట్టుచీర, ఫల, మంత్రాక్షితలు , మెమోంటోతో ఆశీర్వదించారు. వీరి వెంట మాజీ ఎమ్మెల్యే శంకరప్ప , బీజేపీ బళ్లారి జిల్లా ప్రధాన కార్యదర్శి ధనుంజయ , కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు రామకృష్ణ , ప్రధాన కార్యదర్శి సావిత్రి , తదితరులు పాల్గొన్నారు.కర్నూలు జిల్లా మంత్రాలయం ప్రజా నేత్ర రిపోర్టర్ వి నరసింహులు

Leave A Reply

Your email address will not be published.