మండలంలో ఇళ్ల స్థలాలు ఇవ్వని గ్రామాలలో స్థలాలు కేటాయించి పక్కా గృహాలు నిర్మించాలి సిపిఎం డిమాండ్

మండలంలో ఇండ్ల స్థలాలు ఇవ్వాలని గ్రామాలలో తక్షణమే ఇంటి స్థలాలు కేటాయించి పక్కా గృహాలు నిర్మించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తాసిల్దార్ ఆర్ శివ రాముడు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కన్వీనర్ బి నాగన్న సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు జి శ్రీధర్ ఎస్ షాజహాన్ లు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ మండలంలో గుట్టపాడు తిన్నాయి పల్లె కొమరోలు చింతలపల్లి పూడి చర్ల తదితర గ్రామాలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీలను ఏర్పాటు చేయలేదని తక్షణమే ఏర్పాటు చేసి ఇంటి స్థలాలు లేని పేదలను గుర్తించి తక్షణమే వారికి ఇంటి స్థలాలు మంజూరు చేయాలని అదేవిధంగా పక్కా గృహాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు అదేవిధంగా మండలంలో ఫస్ట్ విడతలో స్థలాలు రానివారు పేద ప్రజలు వేలాది మంది ఉన్నారని ప్రభుత్వం వారు 90 డేస్ కింద పేద లందరూ నమోదు చేసుకోవాలని వారందరికీ పట్టాలు మంజూరు చేస్తామని చెప్పారని అన్నారు కానీ ఇంత వరకు చాలా మంది సచివాలయాల లో స్థలాల కోసం నమోదు చేసుకున్నప్పటికీ ఇంటి స్థలాలు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు కావున తక్షణమే మండలంలో ప్రతి గ్రామంలో ఎవరైతే పేద ప్రజలు నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వారందరినీ గుర్తించి తక్షణమే ఇంటి స్థలాలు మంజూరు చేసి వారికి పక్కా గృహాలను నిర్మించాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో ఇంటి స్థలాలు పక్కా ఇల్లు లేని నిరుపేదలు అందరిని కూడగట్టి ఆందోళన చేపడతామని అన్నారు అనంతరం అం తాసిల్దార్ శివరాముడు గారు మాట్లాడుతూ సానుకూలంగా స్పందించి సచివాలయాల్లో నమోదు చేసుకున్న వారందరికీ రెండో విడతలో పట్టాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నాయక్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.ప్రజానేత్ర. న్యూస్.మౌలాలి

Leave A Reply

Your email address will not be published.