మండలంలోని పలు సచివాలయాలను సందర్శించిన – జె సి శ్రీనివాసులు

పొందూరు మండలంలోని గోకర్ణపల్లి,తాడివలసలో ఉన్న గ్రామ సచివాలయంలను జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఆకస్మికంగా సందర్శించడం జరిగింది. తాడివలసలో ఉన్న సచివాలయ సిబ్బందిని ప్రజలకు వారు అందిస్తున్న సేవలు గృహానిర్మాణాలు, చేయూత, రైతుభరోసా ,గ్రామంలో కోవిడ్ లో భాగంగా చేయవలసిన సర్వేలు,సిబ్బంది,వలంటీర్ ల హాజరు వంటి విషయాలను అడిగి తెలుసుకుని 15 మంది వలంట్రీస్ కు 12మంది హాజరు వేశారు,మిగిలిన ముగ్గురు ఎందుకు వేయలేదు అని ప్రశ్నించారు, సచివాలయ సిబ్బంది పనితీరుపై అసంతృప్తి చెందడం జరిగింది.సచివాలయంలో వివిధ పథకాల లభ్దిదారుల జాబితాలు,కోవిడ్ పై ప్రజలకు అవగాహన కల్పిపించుటకు ప్రభుత్వం ఇచ్చిన పోస్టర్లను అతికించలేదని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు సచివాలయ సిబ్బంది టైమ్ కు హాజరు కావటం లేదని,స్థానికంగా నిర్మించిన రైటుభరోసా కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన డిజైన్ ప్రకారం నిర్మణం జరగలేదని,సిబ్బంది చేతివాటంతో అర్హులకు పథకాలు అందటం లేదని తెలియచేయటం జరిగుంది.దీని పై జేసిగారు స్పందిస్తూ సిబ్బంది అందరికి మెమోలు జారిచేస్తామని, పైన తెలిపిన అన్నిటిపైన పూర్తిగా పరిశీలనచేసి 30 రోజుల కాల వ్యవధిలో పరిష్కారం చేస్తామని చెప్పటం జరిగింది, ఈయన వెంట మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఉన్నారు…

గురుగుబెల్లి వెంకటరావు,
ప్రజానేత్ర – రిపోర్టర్

Leave A Reply

Your email address will not be published.