ప్రియురాలిని చంపి ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు
హైదరాబాద్ మాదాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. మాదాపూర్‌లోని లెమన్ ట్రీ హోటల్లో ప్రేయసిని చంపి ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు.యువతిని బ్లేడుతో గొంతు కోసి బాత్రూంలో పడేసిన యువకుడు అనంతరం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న మాదాపూర్ పోలీసులు వివరాలు సేకరించారు.మృతులు మహబూబ్‌నగర్‌కు చెందిన సంతోషి, రాములుగా గుర్తించారు. నిన్న మధ్యాహ్నం లెమన్ ట్రీ హోటల్లో రాములు గది తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మాదాపూర్ పోలీసులు తెలిపారు.