ప్రభుత్వ ఉత్తర్వు లకు వ్యతిరేకంగా అధిక ఫీజులు వసూలు చేస్తే కట్టిన చర్యలు

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో శాంతినికేతన్ ప్రైవేటు పాఠశాల యాజమాన్యంపై ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆ పాఠశాల యాజమాన్యం ప్రభుత్వ ఉత్తర్వు లకు వ్యతిరేకంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని జిల్లా కలెక్టర్ గారికి వ్రాతపూర్వకంగా తేదీ 27.7.2021 రోజున ఫిర్యాదు చేయడం జరిగినది. అట్టి ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ గారు జిల్లా విద్యాధికారి వారికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. తదుపరి జిల్లా విద్యాశాఖ అధికారి గారు మండల విద్యాశాఖ అధికారి కాగజ్నగర్ గారిని అట్టి ఫిర్యాదుపై విచారణ జరిపి విచారణ నివేదికను సమర్పించ వలసిందిగా ఆదేశించారు. అట్టి ఆదేశాలతో మండల విద్యాశాఖ అధికారి గారు శాంతినికేతన్ పాఠశాల ఈస్గాన్, కాగజ్నగర్ యందు విచారణ చేయడానికి కి వచ్చారు. ఈ విచారణలో విద్యార్థుల తల్లిదండ్రులు మరియు పాఠశాల యాజమాన్యం పాల్గొన్నారు. ఇట్టి విచారణలో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ ఉత్తర్వులు కు వ్యతిరేకంగా పాఠశాల యాజమాన్యం అధిక ఫీజులు వసూలు చేస్తున్న దని ఆరోపణలు చేశారు దీనికి పాఠశాల యాజమాన్యం ఆన్లైన్ క్లాసులు బోధించినట్లు గా మరియు తగు పరీక్షలు కూడా విద్యార్థులకు తీసుకున్నట్లుగా చెప్పడం జరిగింది. విచారణలో తల్లిదండ్రులు ఫీజులు మాఫీ చేయమని విచారణ అధికారిని కోరడం జరిగింది మరియు ప్రభుత్వ ఉత్తర్వులకు లోబడి ఫీజులు వసూలు చేసే విధంగా పాఠశాల యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేయాలని కోరడం జరిగింది.ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రీపోటర్

Leave A Reply

Your email address will not be published.