నిరాశ్రయుల మధ్య లతాశ్రీ, యశ్వంత్ ల జన్మదిన వేడుకలు

ప్రజానేత్ర డోన్ న్యూస్ ;వైయస్సార్సీపి కర్నూలుజిల్లా నాయకురాలు, జాతీయ బీ సీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర(మహిళా విభాగం) ప్రధాకార్యదర్శి, రాయలసీమ మహిళా సంఘ్ వ్యవస్థాపక అధ్యక్షురాలు, సామాజిక సేవకురాలు గోరంట్ల శకుంతల కుమార్తె లతాశ్రీ, కుమారుడు యశ్వంత్ ల జన్మదిన వేడుకలను అనాధల మధ్య ఘనంగా జరిపారు.కర్నూలు నగరంలో అశోక్ నగర్ పంపు హౌస్ వద్ద ఉన్న నిరాశ్రయ వసతిగృహంలో గోరంట్ల శకుంతల తన కూతురు, కుమారుడు ల జన్మదిన వేడుకలు గురువారం నిర్వహించారు. అక్కడి నిరాశ్రయుల మధ్యనే కేక్ కట్ చేయించారు. వారికి అల్పాహారం కూడా ఏర్పాటుచేయించి టిఫిన్ బాక్స్ లు పంపిణి చేశారు. అనంతరం గోరంట్ల శకుంతల మాట్లాడుతూ సేవా దృక్పధం పిల్లలలో రావాలనే ఉద్దేశ్యంతోనే తన పిల్లల జన్మదిన వేడుకల్ని నిరాశ్రయుల మధ్యలో జరుపామని, తన బిడ్డల్ని అందరూ దీవించాలని ఆమె కోరారు.ప్యాపిలి ప్రతినిధి..

Leave A Reply

Your email address will not be published.