నడుస్తూ ఉండగా వృద్ధుడి కాళ్ళను చుట్టేసిన విషసర్పం

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల జంగపల్లి గ్రామంలో విష సర్పం కలకలం రేపింది.రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లోన్న వ్యక్తిపై ఒక్కసారిగా పాము ఎటాక్‌ చేసింది.గడ్డమీది రాజయ్య అనే వ్యక్తిని ఎటూ కదలనీయకుండా కాళ్లను చుట్టేసింది. ఒక్కసారిగా పాము చుట్టుకోవడంతో రాజయ్య భయపడలేదు.మరొకరి సాయంతో పామును మెల్లగా వదలించుకున్నాడు. పాము ఎలా రాజయ్యను ఎలా చుట్టుకుంటుందో మీరు ఒక్కసారి చూడండి.ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఎలా వచ్చిందో తెలియదు కానీ రోడ్డుపై నడస్తున్న రాజయ్యను పాము చుట్టేసింది.చూస్తేనే పాము ఆరు అడుగుల ఉంది. పైగా బలంగా ఉంది. కాలును చుట్టేసి రాజయ్యను ఉక్కిరిబిక్కిరి చేసింది.చివరకు రాజయ్య మరొకరి సాయంతో ధైర్యంగా పామును విడిపించుకోవడంతో గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు.ఆ తర్వాత పాము పట్టుకుని తలను మలిచి భూమిపై పడేసి కర్రతో కొట్టి చంపేశాడు వృద్ధుడు రాజయ్య.శుక్రవారం సాయంత్రం కరీంనగర్‌ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లిలో జరిగింది.ఆ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రాణ భయంతోనే పామును చంపేసినట్లు రాజయ్య తెలిపాడు.

Leave A Reply

Your email address will not be published.