చాకలి సుంకన్న పై అమానుషం

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం. బింగిదొడ్డి గ్రామంలో చాకలి సుంకన్న పై గ్రామములో మధ్యలోనే ఉదయం 6:30 గంటలకు అగ్రవర్ణాలకు చెందిన విశ్వనాథరెడ్డి. మల్లికార్జున రెడ్డి. విష్ణువర్ధన్ రెడ్డి. ఇనుపరాడ్లతో దాడి చేసి హత్య ప్రయత్నం చేసి తీవ్రంగా గాయపరచడం జరిగింది ఈ సంఘటనపై 30-07- 2021 తేదీన బింగిదొడ్డి గ్రామానికి వెళ్లి దాడికి గురైన వ్యక్తిని చాకలి సుంకన్న కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ చేతివృత్తుల సంఘాల సమైక్య రాష్ట్ర కన్వీనర్ కె రామాంజనేయులు గారు మాట్లాడుతూ వైయస్సార్ పార్టీకి చెందిన రెండు గుంపుల తగాదాల గ్రామంలో స్థానిక పంచాయతీ ఎన్నికల్లో చాకలి సుంకన్న కుటుంబo తమకు మద్దతు ఇవ్వనందు వలన ఓడిపోయామని అక్కసుతోనే తన మనసులో ఉంచుకొని సుంకన్న 2 ఎకరాల భూమి లో ఎలాంటి రస్తా లేకున్నప్పటికీ దౌర్జన్యంగా ట్రాక్టర్లతో తిరిగారని సుంకన్న ప్రశ్నించగా మరియు గ్రామ సచివాలయం కి వెళ్లే నీటి పైప్ లైన్ నుండి చాకలి సుంకన్న ఇంటికి నీటి కనెక్షన్ తీసుకున్నాడని. మా పొలం నుంచి పోయిందని కక్షకట్టి అగ్రవర్ణాల వారు నిర్దాక్షిణ్యంగా ఇనుపరాడ్లతో సుజాత కోడలు పైన కూడా దాడి చేసి గాయపరిచారు ఈ సంఘటన పూర్తిగా దౌర్జన్య పూరితంగా ఆ గ్రామంలో గ్రామానికి సేవలందించే గ్రామానికి రజకులను అక్కసుతో కుటుంబం పైన అగ్రవర్ణాల వారు తీవ్రంగా దాడి చేశారు గతంలో కూడా దళితుల పై దాడి చేసిన నేరచరిత్ర వాళ్లకు ఉన్నది 75 సంవత్సరాల స్వతంత్ర పాలనలో నేటికీ కులం పేరుతో దూషిస్తే వివక్షతో దాడులు చేయడం ఇప్పటికైనా తక్షణమే సామాజిక వివక్ష తో నిర్దాక్షిణ్యంగా దాడి చేసిన వారిపై కేసులు హత్య కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ వెల్దుర్తి మండల టీ.కృష్ణ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు జి మాధవ కృష్ణా. జి. బాలరాజు. సీపీఐ నాయకులు డి .రాజు.ఎల్ల శంకర్. హరి తదితరులు పాల్గొన్నారు…ప్రజానేత్ర. న్యూస్.మౌలాలి.

Leave A Reply

Your email address will not be published.