గ్రామీణ ప్రాంత ప్రజలు మెచ్చుకునేలా సర్పంచులు సేవలందించాలి పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ
గ్రామీణ ప్రాంత ప్రజలు మెచ్చుకునేలా సర్పంచులు సేవలందించాలని పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ గారు తెలియజేశారు. కర్నూల్ నగర శివారులోని జీవసుధ లో కృష్ణగిరి, వెల్దుర్తి ,ప్యాపిలి,కల్లూరు మండలాల్లోని గ్రామాలకు చెందిన సర్పంచుల తో మూడు రోజుల శిక్షణ తరగతులకు ఎమ్మెల్యే గారు హాజరయ్యారు.గ్రామాలలో ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు వీధిదీపాల పై దృష్టి పెట్టాలన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో నీరు కలుషితం కాకుండా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో డివిజినల్ పంచాయతీ గారి తిమ్మక్క, ఈ ఓ ఆర్ డి లు నరసింహులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు….ప్రజానేత్ర. న్యూస్.మౌలాలి