కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం ..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఈ రోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో “దళిత సంఘాల” ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ ను దగ్ధం చేయడం జరిగింది. ఈటల రాజేందర్ బామ్మర్ది మధుసూదన్ రెడ్డి దళితుల పట్ల సామాజిక మాధ్యమాల్లో చేసిన అనుచిత వ్యాఖ్యలకు,నిరసనగా దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు పథకం ప్రవేశ పెట్టి ప్రతి కుటుంబానికి 10 లక్షల చొప్పున మంజూరు చేసి వారి కుటుంబాల్లో ఆనందాన్ని నింపాలని చూస్తుంటే ఈటెల రాజేందర్,వారి కుటుంబ సభ్యులు దళితుల మీద అక్కసుతో హుజురాబాద్ లో ఓడిపోతాం అనే భయం పట్టుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరి కాదని వెంటనే మధుసూధన్ రెడ్డి పై SC,ST అట్రాసిటీ నమోదు చేసి,అరెస్ట్ చేయాలని డిమాండ్” చేశారు. ఈ కార్యక్రమంలో రాగటి రమేష్ కడగండ్ల తిరుపతి శవనపెల్లి రాకేష్ పసుల బాబు గజ్జెల శ్రీను దమని మధు బాబు తిరుపతి బెజెంకి తిరుపతి మరియు నాయకులు పాల్గొన్నారు.
బొల్లం సాయిరెడ్డి మండల్ రిపోర్టార్ ఇల్లంతకుంట

Leave A Reply

Your email address will not be published.