కార్మిక,రైతు వ్యతిరేక చట్టాల రద్దుకై పోరాటానికి సిద్ధం కండి.

ప్యాపిలి ,మోడీ ప్రభుత్వ,కార్మిక,రైతు వ్యతిరేక చట్టాల రద్దుకై మోడీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మికులు, కర్షకులందరు పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు,ఆo.ప్ర.వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో CITU డోన్ పట్టణ కార్యదర్శి టి.శివరాం అధ్యక్షతన విస్తృతస్థాయి సమావేశం శనివారం ప్యాపిలి పట్టణంలో జరిగింది.అనంతరం ఆo.ప్ర.వ్యవసాయ కార్మిక సంఘం కర్నూలు తూర్పు జిల్లా అధ్యక్షుడు ఆర్.ఈశ్వరయ్య లు మాట్లాడుతూ దేశ రాజధాని లో జరుగు రైతాంగ పోరాటాన్ని నిరుగార్చే పద్దతిలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూనుకుంటుందన్నారు.బీజేపీ కుయుక్తులను తిప్పికొడుతూ ఈ మధ్యకాలంలో రైతాంగ ఉద్యమానికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందిని వారన్నారు.ఉత్తర భారత దేశంలోనే కాకుండా ఇతర రాష్ర్టాల నుండి కూడా కార్మికులను,కర్షకులను ఐక్యం చేసి కేంద్రలోని బిజెపి ప్రభుత్య మెడలు వంచి నల్లచట్టాలు రద్దు చేసేంతవరుకు పోరాటాలను ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు.కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు 1942 స”లో అప్పటి ఆంగ్లేయుల కాలంలోనే పోరాడి కార్మికుల సంక్షేమం కోసం 44 చట్టాలను మరియు 8 గ”ల పనిని సాదించుకోవడం జరిగిందన్నారు.కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నీరు గార్చుట కోసం బిజెపి ప్రభుత్వం 4 లేబర్ కోడ్ లను తీసుకోచిందన్నారు.ఉపాధిహామీ పథకం ద్వారా వ్యవసాయ కూలీలకు 200 రోజులు పని,రూ.600/-లు వేతనం ఇవ్వాలని,ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలని,కౌలురైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని,భూయజమానులకు సంబంధము లేకుండా బ్యాంకుల ద్వారా ఋణాలు ఇవ్వాలని ఆగస్టు 9వ తేదీన తహశీల్దార్ కార్యాలయం ముందు జరుగు సేవ్ ఇండియా ధర్నా కార్యక్రమాన్ని కార్మికులు,రైతులు,ఉపాధి కూలీలు,అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు.ఈ సమావేశంలో DYFI డోన్ నియోజకవర్గం నాయకులు ఎం.మధుశేఖర్
లతో పాటు కార్మికులు,కర్షకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజా  నేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.