ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ అడాప్షన్ డే వేడుకలు

ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ అడాప్షన్ డే
ముఖ్యఅతిథిగా గౌరవనీయులు శ్రీ లక్ష్మీనారాయణ గారు పెద్దపల్లి అదనపు కలెక్టర్
ఈరోజు 22-07-2021 గురువారం రోజున ఉదయం 07.45 నిమిషములకు పెద్దపల్లిలో ఐటిఐ గ్రౌండ్స్ ,
ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ అడాప్షన్ డే వేడుకలను  పెద్దపల్లి పట్టణంలోని అన్ని లయన్స్ క్లబ్,లయన్స్ క్లబ్ పెద్దపల్లి లయన్స్ క్లబ్ పెద్దపల్లి ఎలైట్ లయన్స్ క్లబ్ పెద్దపల్లి శ్రీ శక్తి లయన్స్ క్లబ్ పెద్దపల్లి శాతకర్ణి లయన్స్ క్లబ్ పెద్దపల్లి చైతన్య లయన్స్ క్లబ్ పెద్దపల్లి ఎలైట్ లియో. లయన్స్ క్లబ్ జూలపల్లి శివం ఆధ్వర్యంలో బస్టాండ్ నుండి అయ్యప్ప టెంపుల్ వరకు ర్యాలీ ఉమ్మడి కార్యక్రమంగా
ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గౌరవనీయులు శ్రీ లక్ష్మీనారాయణ గారు పెద్దపల్లి అదనపు కలెక్టర్ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ.ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ అడాప్షన్ డే భారతదేశ జాతీయ పతాకం ప్రతి భారతీయ ప్రజల హృదయంలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది, ఎందుకంటే ఇది మన దేశాన్ని సూచిస్తుంది మరియు ప్రాతినిధ్యం వహిస్తుంది అలాగే మన దేశాన్ని మరియు దానిలో నివసిస్తున్న ప్రజలందరికీ 1947 లో బ్రిటిష్ పాలన నుండి స్వేచ్ఛను అందించింది. జాతీయ జెండా స్వీకరణ దినోత్సవం ద్వారా , మన జాతీయ జెండా యొక్క దత్తత రోజు, మన జాతీయ జెండా యొక్క ప్రాముఖ్యత, హృదయపూర్వక వందనం, గౌరవం మరియు గౌరవం ఇవ్వడంతో పాటు భారతీయ సంస్కృతులు మరియు సంప్రదాయాలను మన కొత్త తరాలకు నడిపిస్తాము అని అన్నారు.
ఈ సందర్భంగా పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ వెంకటేశ్వరరావు , డాక్టర్ విజయ్ మరియు జోన్ చైర్ పర్సన్ డాక్టర్ అశోక్కుమార్ నేషనల్ ఫ్లాగ్ అడాప్షన్ డే చరిత్ర గురించి మాట్లాడుతూ పింగలి వెంకయ్య రూపొందించిన భారతీయ జాతీయ జెండాను భారత రాజ్యాంగ అసెంబ్లీ 1947 జూలై 22 న జరిగిన సమావేశంలో మొదటిసారిగా స్వీకరించింది, అందుకే 1947 నుండి ప్రతి సంవత్సరం భారతదేశమంతటా “ఇండియన్ నేషనల్ ఫ్లాగ్” పేరుతో జరుపుకుంటారు. అడాప్షన్ డే ”జూలై 22 న. రాజ్యాంగ అసెంబ్లీ సమావేశంలో “భారత డొమినియన్ యొక్క అధికారిక జెండా” గా అధికారికంగా ప్రకటించినప్పుడు జాతీయ జెండా యొక్క ప్రస్తుత రూపం అధికారంలోకి వచ్చింది.జాతీయ జెండా యొక్క త్రివర్ణ అంటే తిరంగాను భారతీయ జెండా కోడ్‌లో టాప్ కలర్ కుంకుమపువ్వు (ధైర్యం మరియు త్యాగానికి ప్రాతినిధ్యం వహిస్తుంది), దిగువ రంగు ఆకుపచ్చ (శ్రేయస్సును సూచిస్తుంది) మరియు మధ్య రంగు తెలుపు (శాంతి, నిజం మరియు స్వచ్ఛతను సూచిస్తుంది) అని అశోక చక్రం కలిగి ఉంది నేవీ బ్లూ కలర్ (ధర్మ చట్టాలను సూచించడం అంటే ధర్మం అంటే) మధ్యలో 24 చువ్వలు ఉన్నాయిఅని అన్నారు . ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ వెంకటేశ్వరరావు, డాక్టర్ విజయ, జోన్ చైర్పర్సన్ డాక్టర్ అశోక్ కుమార్ ,PRC అధ్యక్షుడు మరియు ప్రోగ్రాం చైర్ పర్సన్ బాబురావు, ప్రోగ్రాం కోఆర్డినేటర్ జైపాల్ రెడ్డి, లైన్స్ క్లబ్ పెద్దపల్లి అధ్యక్షులు వజాతుల అయాజ్, చంద్రగిరి వంశరాజ్, విజయ గిరి సుధా, పవన్ కుమార్ ,వివేక్ పటేల్ ,కార్యదర్శిలు శశాంక ,సంపత్ రావు, కోశాధికారిలు సాదు వెంకటేశ్వర్లు, లైశెట్టి అనిత, జిల్లా అధికారులు రాజగోపాల్ అల్లంకి శ్రీనివాస్, కంకత్తి శ్రీనివాస్ గుజ్జుల కుమార్ వేణుగోపాల్ బిక్షపతి సతీష్ రెడ్డి , డాక్టర్ అజీజ్, డాక్టర్ మల్లేశం శివగారు సతీష్, భాస్కర్ రెడ్డి, రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..ప్రజానేత్ర రిపోర్టర్ లక్ష్మి నారాయణ పెద్దపల్లి

Leave A Reply

Your email address will not be published.