ఆగస్టు 9న జరిగే సేవ్ ఇండియా కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

కర్నూల్ జిల్లా డోన్ ఆగస్టు 9న తహసిల్దార్ కార్యాలయం ముందు జరిగే సేవ్ ఇండియా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల నాయకులు కోరారు.
స్థానిక పెన్షనర్స్ కార్యాలయం నందు బుధవారం సిఐటియు మండల కార్యదర్శి టి.శివరాం అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు వై.ఎల్లయ్య, వ్యవసాయ కార్మిక సంఘం తూర్పు జిల్లా అధ్యక్షుడు ఆర్.ఈశ్వరయ్య, వైయస్సార్ పార్టీ నాయకులు కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్, సిపిఐ పార్టీ డోన్ నియోజకవర్గ కార్యదర్శి బి.రంగ నాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎం రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుబ్బు యాదవ్, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘం రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ సాయి, పెన్షనర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు భాను సింగ్, యుటిఎఫ్ జిల్లా నాయకులు మాణిక్యoశెట్టి, బలిజ సంఘం మండల ఉపాధ్యక్షులు సోమ నాగిరెడ్డి గార్లు హాజరై మాట్లాడారు.
గతంలో క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో బ్రిటిష్ వారి నుండి దేశాన్న కాపాడుఉన్నామని ఇప్పుడు అదే స్ఫూర్తితో మోడీ నుండి భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సేవ్ ఇండియా పోరాటంతో కార్మిక వ్యతిరేక,రైతు వ్యతిరేక నల్ల చట్టాలు రద్దు చేయాలని లేదా మోడీ ప్రభుత్వం గద్దె దిగాలని వారు కోరారు.
ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు నరసింహారెడ్డి, ఏవి భాస్కర్ రెడ్డి, లక్ష్మన్న, గుండాలయ్య, సుంకన్న, మద్దయ్య నక్కీ శ్రీకాంత్, హనీఫ్, రాంబాబు, రాజేష్ సూరన్న,నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
? ప్రజా  నేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.