అడ్రస్ తెలియక వర్షం లో ఉన్న అమ్మాయి ని తన బంధువుల ఇంటికి చేర్చిన ప్రొబేషనరీ ఎస్ఐ రాజశేఖర్

రామగుండం పోలీస్ కమిషనరేట్
ఎన్టిపిసి పోలీస్ స్టేషన్ ప్రొబేషనరి ఎస్ఐ రాజశేఖర్ గారు తన సిబ్బందితో కలిసి పెట్రోల్ నిర్వహింస్తూ మాతంగి కాలనీ వైపు వెళ్తుండగా PTS దగ్గరలో గల బస్టాండ్ వద్ద ఒక అమ్మాయి వర్షంలో తడుస్తూ రోడ్డు మీద నిలబడి ఉండగా ఎస్ఐ రాజశేఖర్ గారు ఆమెను చూసి ఆగి ఆమె వివరాలు తెలుసుకొని ఆమె దగ్గర ఫోన్ లేకపోవడం తో తన ఫోన్ ఇచ్చి తన ఫోన్ నుండి తన బంధువులకు ఫోన్ మాట్లాడించి ఆమెను తన పోలీస్ వాహనం లో ఎక్కించుకొని ప్రగతి నగర్ లో ఉన్న వాళ్ళ పెద్దమ్మ వాళ్లకు అప్పగించడం జరిగినది.అమ్మాయి పెద్దమ్మ మాట్లాడుతూ.. అమ్మాయి ప్రొద్దున నుండి కనబయటం లేదని చుట్టూ ప్రక్కల తిరిగాము అని అమ్మాయి ఇంకా ఇంటికి రాకపోవడం తో మేము మరియు వాళ్ళ అమ్మ వాళ్ళు చాలా భయానికి గురాయ్యమని,మా అమ్మాయిని మాకు అప్పగించడం చాలా సంతోషం గా ఉందని, ధన్యవాదములు కృతజ్ఞతలు తెలిపారు.అమ్మాయిని వారికి అప్పగించినందుకు అమ్మాయి బందువులు వారి చుట్టూ పక్కల ఇళ్ళ వారు SI గారిని మరియు కానిస్టేబుల్ మల్లికార్జున్,హోం గార్డ్ రాజు లను అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.