మంత్రి రాసలీలలు… క్యాబినెట్ నుంచి ఔట్…? సీఎం సీరియస్

తెలంగాణ కు చెందిన మంత్రి గారి రాసలీలలు నెట్టింట్లో హల్‌చల్‌ చేయడంపై… సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. మంత్రి సన్నిహితురాలితో చేసిన చాటింగ్‌ యవ్వారమంతా వైరల్‌‌గా మారిపోయింది. మంత్రి కోరికలు తీర్చేందుకు ఆయన మనసుపడ్డ యువతితో ఆయన సన్నిహితురాలు చేసిన బ్రీఫింగ్‌ ప్రయత్నమంతా బయటకు వచ్చేసింది.
టాలీవుడ్‌లో ఒకట్రెండు సినిమాల్లో నటించిన ఓ యువతిపై మంత్రిగారి కన్నుపడగా.. ఇంకేముంది.. తను నాకు కావాలని తన సన్నిహితురాలి ఎదుట ఓపెన్ అయిపోయాడు. సెట్‌ చేయాలని పురమాయించాడు. వలపు బాణాలు, చిలిపి కోరికలన్నీ చాటింగ్‌లోనే చెప్పుకొచ్చాడు సదరు మంత్రి. కానీ యువతి మాత్రం అంగీకరించలేదు. మంత్రి గారు ఒకటనుకుంటే.. జరిగింది ఇంకొకటి. దీంతో రాజీ ప్రయత్నాలు షురూ చేశారాయన. కానీ అవేవీ వర్కవుట్ కాలేదు. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. మ్యాటర్ చేయి దాటి.. సీన్ అంతా రివర్స్ అయ్యింది. వ్యవహారం సీన్‌ టు సీన్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మంత్రి సన్నిహితురాలి ఫోన్‌లోని చాటింగ్‌ను స్క్రీన్ షాట్లతో సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది సదరు యువతి. రాసలీలల మంత్రికి సంబంధించిన వ్యవహారాన్ని మీడియా ఛానల్స్ బయటపెట్టడంతో దీని వెనుక అనేక ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి. దీనిపై రంగంలోకి దిగిన ఇంటెలిజెన్స్ సిబ్బంది పూర్తి వివరాలను సేకరించే పనిలో పడ్డారు. సీఎం కేసీఆర్ కూడా మంత్రి రాసలీలల వ్యవహారం పై సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో సదరు మంత్రికి ఉద్వాసన పలికితే, కవిత కు లైన్ క్లియర్ అవుతుంది అన్న భావన వ్యక్తమవుతోంది. కవిత మంత్రి పదవి కోసమే ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకువచ్చారా అన్న అనుమానాలు కూడా పలువురు రాజకీయ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.