కొందరి స్వార్థం వల్లే తెలుగు రాష్ట్రం ముక్కలైంది…మంత్రి ఎమ్మెల్యేలు
అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణాలర్పించి సాధించిన తెలుగు రాష్ట్రాన్ని కొందరి స్వార్థం వల్ల విడదీశారని అనంతపురం జిల్లా కు చెందిన మంత్రి శంకర్ నారాయణ ఇతర ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో జరుపుకున్న విధంగానే నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవాలను నిర్వహించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇవాళ జిల్లావ్యాప్తంగా అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రం విడిపోయినప్పటికీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని మంత్రి శంకర్ నారాయణ అన్నారు. ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అవతరణ దినోత్సవం సందర్భంగా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు గతంలో అవతరణ దినోత్సవాన్ని విస్మరించారని నవ నిర్మాణం పేరుతో కార్యక్రమాలు నిర్వహించాలని మండిపడ్డారు. అమరజీవి త్యాగాలను స్మరించుకుంటూ తమ ప్రభుత్వం నవంబరు 1నే అవతరణ దినోత్సవం నిర్వహిస్తుందని ఆయన స్పష్టం చేశారు.