అత్యంత విషాదం.. ఒకరు తరువాత ఒకరు.. కుటుంబమంతా మృత్యు ఒడిలోకి..

 

[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]

కరోనా పట్ల నిర్లక్ష్యంగా ఉండే అది కుటుంబాల పై ఎంత ప్రభావం చూపుతుందో చెప్పేదే.. ఈ సంఘటన. బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్ న్యాయవాది సుల్తాన్ మూసావి, అతని భార్య, అతని కుమారుడు, అతని తల్లి *ఒకే కుటుంబానికి చెందిన మొత్తం నలుగురు* కరోనా మహమ్మారి నుండి తప్పించుకోలేక పోయారు… ఈరోజు ఉదయం సుల్తాన్ మూసావి కుమారుడు ఫైవ్ ఇయర్స్ లా చదువుతున్న జావీద్ ముసావి హాస్పిటల్ నందు చికిత్స పొందుతూ క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్న తరుణంలో… తను కూడా కరోనా వైరస్ కారణంగా తుది శ్వాస విడిచాడు అని తెలియజేయవలసి రావడం అత్యంత విచారకరమైన, బాధాకరమైన, దయనీయ కరమైన వరుస సంఘటనలు. మనలను నవ్వుతూ పలకరించేవారు పరిచయస్తులు, బంధువులు, స్నేహితులు… చాలామంది మృత్యువాత పడుతున్నారు… సుల్తాన్ మూసావి మరణం చాలా విచారకరం… ముందుగా వారి తల్లిగారు, తరువాత వారి భార్య, నిన్నటి రోజు *సుల్తాన్ మూసావి* ఈరోజు ఉదయం వారి కుమారుడు…వరుస మరణాలు మనందరిని విషాదంలో ముంచివేసాయి… ఎంత జాగ్రత్తగావున్నా… ఎటోఒకవైపునుండి కరోనా వేటుకు గురవుతున్నాం… జాగురూకతే మనకు మందు… ధైర్యమే మనకు ఆయుధం… విందులు, వేడుకలకు దూరంగావుందాం… సమూహ సంచారాలకు స్వస్తి చెబుదాం..

Leave A Reply

Your email address will not be published.