సచివాలయమే… బార్ అయింది
ప్రజలకు సేవలందించే దేవాలయాలాంటి సచివాలయాల్లో సిబ్బంది మందు కొడుతూ హల్ చల్ చేశారు. రాప్తాడు మండలం బండమీదపల్లి సచివాలయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గత రాత్రి సిబ్బంది ఇక్కడ మద్యం సేవించి.. మద్యం సీసాలు, గ్లాసులు కార్యాలయంలో పడేశారు. అంతే కాకుండా ప్రజలు సమస్యల రూపంలో ఇచ్చిన దరఖాస్తులను కింద పడిపోయి ఉన్నాయి. కంప్యూటర్ సామగ్రి సైతం చెల్లా చెదురుగా పడేశారు. ఈ సంఘటన చూసిన గ్రామస్థులు సిబ్బంది వ్యవహారం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.