టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను మంత్రి శంకరనారాయణ మొద్దు ఎద్దుతో పోలిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీడీపీ తీవ్రంగా రియాక్ట్ అయింది. మంత్రి శంకరనారాయణ దున్నపోతు లాంటి వారని.. హిందూపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు పార్థసారధి అన్నారు. లోకేష్ రైతులను పరామర్శించేందుకు వస్తే.. ప్రభుత్వం వాస్తవాలు గుర్తించాల్సింది పోయి.. దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శంకరనారాయణ దున్నపోతులా వ్యవహరిస్తున్నారని.. ఎవరి గురించైనా మాట్లాడటప్పుడు హుందాగా వ్యవహారించాలని హితవు పలికారు. వైసీపీ, టీడీపీల మధ్య సాగుతున్న ఈ తిట్ల పురాణంపై కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు…..