బ్లాక్ సండే- బ్లడ్ సండే

ఒకే రోజు మూడు హత్యలు.. ఒక సూసైడ్

 

మర్డర్-1

అనంతపురంలోని చెరువు కట్టమీద గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మంచాలకు ఇనుప వైరు అల్లె వ్యక్తి గత రాత్రి టీవీఎస్ వాహనంలో చెరువు కట్ట మీదకు వచ్చి అక్కడే నిద్రించగా.. గుర్తు తెలియని వ్యక్తులు అతని తల పై రాయి తో మోది దారుణంగా హత్య చేశారు. అనంతరం వాహనం తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఉదయం ఈ సంఘటనను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సీసీ పుటేజ్ ఆధారంగా కోసం నిందితుల కోసం గాలిస్తున్నారు. హతుడు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు.

మర్డర్-2

శింగనమల మండల పరిధిలోని నాయనపల్లి క్రాస్ సమీపంలో ఉన్న ఒక మహిళను అత్యంత దారుణంగా హత్య చేసి కాల్చివేశారు. ఉదయం పొలాల్లో కాల్చిన మహిళ శవం కనిపించడంతో ఆందోళం చెందిన పోలీసులు శింగనమల పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని చూడగా.. మహిళ శవం గుర్తు పట్టలేని విధంగా ఉంది. దీనిపై దర్యాప్తు చేయగా…పెద్దపప్పూరు మండలం నారాపురానికి చెందిన నరసమ్మగా గుర్తించారు. ఆస్తి కోసమే 54 ఏళ్ల నరసమ్మను భర్త హత్య చేసినట్లు తెలుస్తోంది.

మర్డర్-3

నల్లమాడ మండలం రెడ్డికుంట తండాలో ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన బుక్కా కాసేనాయక్‌ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు తండా సమీపంలోని వంకలో బండరాయితో మోది హత్య చేశారు. అక్రమ సంబంధం నేపథ్యంలోనే ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

రైలు పట్టాల పై ఆత్మహత్య….

చెన్నేకొత్తపల్లి మండలంలో ఒక వ్యక్తి రైలు కింద ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనను ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చనిపోయిన వ్యక్తి గ్రామం వద్ద కాటి కాపరిగాను, చెత్త కాగితాలు ఏరుకుంటూ ఉండేవాడని.. మద్యం మత్తులోనే ఇలా జరిగి ఉంటుందని చెబుతున్నారు.

జిల్లాలో ఒకేరోజున ముగ్గురు హత్యకు గురికావడం, ఒక ఆత్మహత్య చేసుకోవడంపై ప్రజల్లో ఒకింత భయాందోళను రేకెత్తించింది. ఈ నాలుగు ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

 

 

 

Leave A Reply

Your email address will not be published.