పెళ్లి సంబంధం అడిగినంందుకు… బ్లడ్ పడింది

మీ అమ్మాయిని తన కొడుక్కి ఇవ్వమని అడినందుకు కత్తితో సమాధానం ఇచ్చారు.. అవతలి వారు. ఈ సంఘటన అనంతపురం జిల్లాలోని హిందూపురంలో జరిగింది. పట్టణానికి చెందిన చాంద్ బాషా కుమారుడు సైఫుల్లా మోడల్ కాలనీకి చెందిన ఓ యువతి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ క్రమంలో చాంద్‌ భాషా… యువతి ఇంటికి వెళ్లి పెళ్లి సంబంధం అడగడంతో అవతలి వారు ఆగ్రహంతో ఊగిపోయారు. అమ్మాయి తరుఫున వారు ఒక్కసారిగా కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన చాంద్ బాషాను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave A Reply

Your email address will not be published.