దొంగల ముఠాలో మైనర్ బాలుడు.

దొంగల ముఠాలో మైనర్ బాలుడు అనంతపురంలో గత కొంత కాలంగా ద్విచక్రవాహనాలు దొంగలించే ముఠాను పోలీసులు పట్టుకున్నారు. రాప్తాడు మండలం భోగినేపల్లికి చెందిన ముత్యాలు, గార్లదిన్నె మండలం కల్లూరుకు చెందిన ప్రసాద్ లు చెడు వ్యసనాలకు బానిసై ద్విచక్రవాహనాలు దొంగలిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ద్విచక్రవాహనాలు ఎక్కువగా చోరీకి గురి కావడంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో వీరిద్దర్ని చాకచక్యంగా పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి పదిన్నర లక్షలు విలువ చేసే 32 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో ఒక మైనర్ కూడా ఉండటంతో జువైనల్ బోర్డు ఎదుట హాజరు పరిచినట్లు ఎస్పి సత్య ఏసుబాబు తెలిపారు. మరోవైపు ఈ ఏడాది 99వాహనాలు చోరీకి గురయ్యయాని ఫిర్యాదులు వచ్చాయని.. వీటిలో 75 వాహనాలను రికవరీ చేశామని చెప్పారు....

Leave A Reply

Your email address will not be published.