దివాకర్ ట్రావెల్స్ కేసులో పెద్దారెడ్డి నయా ట్విస్ట్

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దివాకర్ ట్రావెల్స్ వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసు కొత్త మలుపు తిరిగింది. 2017లో బీఎస్-3 వాహనాలను సుప్రీంకోర్టు నిషేధించింది. అయితే బిఎస్-3 వాహనాల ను అశోక్ లైలాండ్ నుంచి స్క్రాప్ కింద దివాకర్‌ ట్రావెల్స్‌ యాజమాన్యం కొనుగోలు చేసి…నిషేధిత వాహనాలకు నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి తో పాటు పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి జైలుకు కూడా వెళ్లారు. ప్రస్తుతం వారు బెయిలుపై విడుదలయ్యారు. ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతుందని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కొత్త ట్విస్ట్ ఇచ్చారు. దివాకర్ ట్రావెల్స్ అక్రమాలపై కర్ణాటక లోకాయుక్తను ఆశ్రయించారు. జేసీ దివాకర్‌రెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు చవ్వా గోపాల్‌రెడ్డి ఫోర్జరీలపై లోకాయుక్తకు ఆధారాలు సమర్పించారు. జేసీకి సహకరించిన కర్ణాటక రవాణా శాఖ అధికారుల పాత్రపైనా ఫిర్యాదు చేశారు. కర్ణాటక డీజీపీ, పలువురు మంత్రులకు వీరిపై ఫిర్యాదు చేశారు.

Leave A Reply

Your email address will not be published.