దారి తప్పిన కానిస్టేబుళ్లు… బంగారం బిస్కెట్లు..!

అనంతపురం జిల్లాలో ఇద్దరు కానిస్టేబుళ్లు బంగారం వ్యాపారి వద్ద చేతివాటం ప్రదర్శించారు. కొడికొండ వద్ద నిన్నటి రోజు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. బెంగళూరు నుంచి వస్తున్న ఓ వాహనంలో మద్యం బాటిళ్లు, బంగారం బయటపడింది. అయితే వారి వద్ద బిల్లులు లేకపోవడంతో ఒక ఎక్సైజ్, మరొక సివిల్ కానిస్టేబుల్ వ్యాపారిని బెదిరించారు. బంగారానికి సరైన బిల్లులు లేకపోవడంతో రెండు బిస్కెట్లు తీసుకుని వారిని వదిలేశారు. అయితే ప్రొద్దుటూరుకు చెందిన సదరు వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చిలమత్తూరు ఎస్ ఐ వారిపై కేసు నమోదు చేశారు. అనంతరం కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకుని.. బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.