తొలిసారి బాలయ్యకు పార్టీలో కీలక బాధ్యతలు
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇక నుంచి పార్టీలో కీలక బాధ్యతను పోషించే అవకాశం కనిపిస్తోంది. ఇన్ని రోజులు ఎమ్మెల్యేగా ఉన్న పార్టీ వ్యవహారాలపై పెద్దగా ఫోకస్ పెట్టలేదు. కాని తొలిసారిగా ఆయనను పొలిట్‌బ్యూరోలోకి తీసుకున్నారు. పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునే పొలిట్‌బ్యూరోలోకి నందమూరి బాలకృష్ణను తీసుకోవడం ద్వారా పార్టీలో కొత్త ఉత్సాహం నెలకొంది . 2014లో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. హిందూపురం నియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 2019 ఎన్నికల్లో రెండోసారి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 12 స్థానాలు వైసీపీ కైవసం చేసుకున్నప్పటికీ బాలకృష్ణ మాత్రం తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.