తల్లిదండ్రులారా బీ కేర్ ఫుల్.. పిల్లలపై నిఘా ఉంచండి

 

 

[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]

 

ఐపీఎల్ క్రికెట్ జరుగుతున్న నేపథ్యంలో అనంతపురం జిల్లా పోలీసులు విద్యార్థుల తల్లిదండ్రులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రత్యేకించి కాలేజ్ స్టూడెంట్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇటీవల ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ల సందర్భంగా క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న వారిని పదుల సంఖ్యలో అరెస్టు చేస్తున్నారు. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున క్యాష్ కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. అయితే పోలీసుల ఇన్వెస్టేగేషన్ లో కొన్ని కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. బెట్టింగ్ కు పాల్పడుతున్న వారిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉంటున్నారని తెలిపారు. తల్లిదండ్రులు పాకెట్ మనీ కోసం ఇచ్చే డబ్బును బెట్టింగ్ లో పెడుతున్నట్లు తేలిందని డీఎస్పీ వీరరాఘవరెడ్డి తెలిపారు. ప్రధానంగా ఐపీఎల్ మ్యాచ్ లు జరిగే సమయం అంటే.. సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి 11గంటల వరకు వారిపై గట్టి నిఘా ఉంచాలన్నారు. చాలా మంది ఆన్ లైన్ లో కొన్ని యాప్ ల ద్వారా బెట్టింగ్ ఆడుతున్నారని పిల్లలు సెల్ ఫోన్ లో ఇలాంటి వాడుతున్నారో లేదో గమనించుకోవాలన్నారు. ఒక్కసారి బెట్టింగ్ లో అరెస్టు అయితే వారి జీవితాలు నాశనం అవుతాయని పోలీసులు చెబుతున్నారు. అందుకే తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది.

 

 

Leave A Reply

Your email address will not be published.