జిల్లాకు మొద్దు ఎద్దు వచ్చింది… మంత్రి ఘాటు వ్యాఖ్యలు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శ నారా లోకేష్ ను ఉద్దేశించి.. రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం లోకేష్ అనంతపురం జిల్లాలో పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వచ్చారు. అయితే ఈ పర్యటనపై మంత్రి శంకరనారాయణ పెనుకొండలో మాట్లాడుతూ జిల్లాకు ఒక మొద్దు ఎద్దు వచ్చిందని.. ఆ ఎద్దుకు వ్యవసాయం అంటే ఏంటో తెలియదన్నారు. కనీసం పంటలెన్ని రకాలు వేస్తారో తెలియని ఆ ఎద్దు సీఎం జగన్ ను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసలు ఆయన పరామర్శలు ఎందుకో జిల్లా ప్రజలకు తెలుసునని.. చేజారిపోతున్న నాయకులను బుజ్జగించేందుకే ఈ యాత్ర అన్నారు.