జగన్ నాయకత్వంలో పని చేసేందుకు సిద్ధం.. శైలజానాథ్ఆసక్తికర కామెంట్స్

కాంగ్రెస్ పార్టీకి బద్ధ వ్యతిరేకి అయిన సీఎం జగన్ నాయకత్వంలో పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని.. పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అయితే ఇక్కడ షరతులు వర్తిస్తాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులతో పాటు, పోలవరం విషయంపై ప్రధానితో సీఎం జగన్ పోరాడితే.. ఆయన నాయకత్వంలో తాము కూడా ముందుకెళ్లేందుకు తమకు ఏమాత్రం అభ్యంతరం లేదన్నారు. పోలవరం విషయంలో సీఎం జగన్ అఖిలపక్షాన్ని పిలిచి కేంద్రంతో పోరాటానికి సిద్ధం కావాలని సూచించారు. లేకపోతే అఖిలపక్షం, రైతు సంఘాలతో కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై పోరాడుతుందన్నారు.

Leave A Reply

Your email address will not be published.