క్రికెట్ బెట్టింగ్ ఆగదా.. ఎన్ని వార్నింగ్ లు ఇచ్చినా మారరా

 

అనంతపురం జిల్లా క్రికెట్ బెట్టింగ్ కు అడ్డాగా మారిపోతోంది. పోలీసులు ఎంత మందిని అరెస్టు చేసినా.. ఎన్ని వార్నింగ్ లు ఇచ్చినా వారిలో మార్పు రావడం లేదు. వరుసగా అరెస్టులు అవుతూనే ఉన్నారు.. ఇంకా కొత్తగా పుట్టుకొస్తుూనే ఉన్నారు. తాజాగా ఆత్మకూరు మండలంలో విచ్చలవిడిగా బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు క్రికెట్ బుకీలతో పాటు బెట్టింగ్ ఆడుతున్న 8మందిని అరెస్టు ఆత్మకూరు పోలీసులు అరెస్టు చేశారు. ఆత్మకూరు మండలం సనప గ్రామానికి చెందిన అశోక్, రజనీకాంత్ అనే ఇద్దరు వ్యక్తులు క్రికెట్ బుకీల అవతారం ఎత్తారు. ఐపీఎల్ వేళ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ.. ఎంతో మంది డబ్బు ఆశ చూపు ఇటు వైపు మళ్లేలా చేస్తున్నారు. మొత్తం పది మందిని అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి సుమారు 2లక్షల నగదు, 7సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. క్రికెట్ బెట్టింగ్ జోలికెళ్లకుండా పిల్లల పట్ల నిత్యం అప్రమత్తంగా వ్యవహరించాలని తల్లిదండ్రులకు డీఎస్పీ వీరరాఘవరెడ్డి సూచించారు.

Leave A Reply

Your email address will not be published.