కాలువ ఏంటి.. టీడీపీలో ఏంటి అంత స్పెషల్

 

టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులుకు మరోసారి పొలిటి బ్యూరో అవకాశం దక్కింది. సోమవారం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కమిటీని ప్రకటించారు. కమిటీలో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులకు మరోసారి అవకాశం కల్పించారు. ఆయనను అధికార ప్రతినిధిగా నియమించారు. తెలుగుదేశం పార్టీతో నే కాలవ శ్రీనివాసులు రాజకీయ రంగప్రవేశం చేశారు. 1999లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం పార్లమెంటు స్థానం నుంచి ఆయన ఎంపీగా విజయం సాధించారు. 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా ఆయన ఓటమి చవిచూశారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాయదుర్గం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో మొదట ప్రభుత్వ చీఫ్‌విప్‌గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం సమాచార, గృహనిర్మాణశాఖ మంత్రిగా పనిచేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాయదుర్గం నుంచి పోటీచేసి ఓటమి చెందారు. ఆది నుంచి పార్టీకి వెన్నంటి నడవడంతో పాటు, పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు అత్యంత విధేయుడిగా మెలుగుతూ వస్తున్నారు.చాలా ఏళ్ల నుంచి ఆయన పొలిట్‌ బ్యూరో సభ్యుడిగానే కొనసా గుతున్నారు. తాజాగా అనంతపురం పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షుడిగా కూడా ఆయన కొనసాగుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.