కామ కానిస్టేబుల్ పై… కేసు ఎందుకు నమోదు కాలేదు

కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ పోలీసు కానిస్టేబుల్ ఓ వివాహిత లైంగికంగా వేధించిన సంఘటన అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది. కణేకల్లు శివారులోని ఓ కాలనీలో భార్య భర్త ఉంటున్నారు. అయితే ఇంట్లో భర్త లేని సమయంలో వివాహతపై స్థానికంగా ఉన్న ఓ కానిస్టేబుల్ కన్నేశాడు. రెండు రోజుల క్రితం రాత్రి వేళ నేరుగా ఆమె ఇంటి వద్ద వెళ్లి.. తన కోరిక తీర్చమని ఒత్తిడి తెచ్చాడు. వెంటనే ఆమె తన భర్త సెల్ కు ఫోన్ చేసి కానిస్టేబుల్ వేధింపుల గురించి చెప్పింది. భర్త హుటాహుటిన ఇరుగుపొరుగు వారితో కలిసి ఇంటికి వెళ్లిఅక్కడున్న కానిస్టేబుల్ ను నిలదీశారు. కానిస్టేబుల్ ని ఇదేం పాడు పని అని ప్రశ్నిస్తే.. వారిపై ఎదురు తిరిగాడు. దీంతో స్థానికులు కానిస్టేబుల్ కు దేహశుద్ధి చేశారు. కానిస్టేబుల్ నిర్వాకంపై బాధితురాలు, ఆమె భర్త అదే రోజు రాత్రే ఫిర్యాదుఇచ్చేందుకు పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. అయితే కానిస్టేబుల్ పై ఫిర్యాదు తీసుకొనేందుకు అక్కడి ఎస్ఏ నిరాకరించారు. పైగా ఇలాంటి విషయాలపై ఫిర్యాదు చేస్తే పరువు పోతుందని ఉచిత సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. అర్ధరాత్రి వరకు అక్కడే ఉన్నా ఎస్ఐ స్పందిచలేదు. మరుసటి రోజు వెళ్లినా అదే తీరు కొనసాగింది. అయితే బుధవారం రాత్రి ఈ విషయంపై రాజీ చేసే ప్రయత్నాలు సాగినట్లు తెలుస్తోంది.

 

Leave A Reply

Your email address will not be published.