హలో అంటే ఇక అంతే.!

ప్రజా ప్రతినిధులను లక్ష్యo గా మోసం చేస్తున్న వైనం హలొ అంటూ ఫోన్ no 9686333999 నుండి మీకు ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం ( పి.యం.ఈ .జి .పి) పేరుతో రుణాలు మంజూరు చేస్తానని, మీ పెట్టుబడీ క్రింద 10%శాతం మేము చేప్పినా ఆకౌoటులో జామ చేస్తే, మీకు 25 లక్షలు నుండి 3 కోట్ల రూపాయలు వరకు రుణాలు మంజూరు చేయిస్తాను అని, తను ఓక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అని చెప్పుకుంటూ, పలుకబడిన రాజకీయ నాయకులకు మరియు వారి అనుచరులకు ఫోన్లు చేస్తూ డబ్బులు గుంజుతున్న మోసగాని వైనం జనరల్ మేనేజర్, జిల్లా పరిశ్రమల కేంద్రము , అనంతపురం వారి దృష్టికి వచ్చినది సదరు మోసగాడు ఓక ప్రజాప్రతినిధికి ఫోన్ చేసి కనకదుర్గంభిక (ఫోన్ 957302511 మరియు 9502703642) పేరిట వున్నఅకౌంటు నెంబరు 33264920024 & IFSC code SBIN0000996 మీరు తమ వాటాగా రెండు లక్షలు కట్టండి అని తెలియజెసినారు. మరియు ఈ నగదును చివరి తేదీ అయిన 31. 08.2020 లోపునే జమచేయండి అని తెలియజేసినాడు. సదరు ప్రజాప్రతినిధి, అతని అనుమానము వచ్చి, సదరు విషయము జనరల్ మేనేజర్, జిల్లా పరిశ్రమల కేంద్రo వారికీ అందచేయడం జరిగినది. జనరల్ మేనేజరు సదరు వ్యక్తికి నకు ఫోన్ చేసి విచారించడంతో వాడి మోసం బయటపడిపోయింది, సదరు మోసగాడితో జనరల్ మేనేజర్ అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పలేయక ఫోన్ కట్ చేసినాడు. తరువాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతను అందుబాటులోకి రావటంలేదు. సదరు విషయమును ప్రజాప్రతినిధి మరియు జనరల్ మేనేజర్ వారు జిల్లా పోలీస్ అధికారులకు పిర్యాదు చేసినట్టు తెలియవచ్చినది, ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం ( పి.యం.ఈ .జి .పి) కొరకు ధరఖాస్తు చేసుకునేవారు, కావలసిన ధ్రువ పత్రాలు మరియు ఏ ఇతర సందేహాల కొరకు పరిశ్రమల శాఖ అధికారులతో కలసి నివృత్తి చేసుకొనగలరు. ఈ పథకమునకు ఏలాంటి మధ్యవర్తుల ప్రమేయము ఉండదు, దయచేసి ఈ పథకములో ఋణము పొందుటకు ఇతరులను, మధ్యవర్తులను కలవటం అవసరం లేదని జిల్లా పరిశ్రమ ల కేంద్రం జనరల్ మేనేజర్ సుదర్శన్ బాబు తెలియ చేశారు..

Leave A Reply

Your email address will not be published.