మసీదుకు…చిన్న జీయర్ స్వామి.!

హైదరాబాద్: హిందూ గురువు అయిన శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి హైదరాబాదులోని బంజారాహిల్స్ లో మసీదుకు వెళ్లారు, తన స్నేహితుడైన అబ్దుల్ రహీమ్ షఫీ కూతురు పెళ్ళికి హాజరు కావడం విశేషం.అబ్దుల్ రహీమ్ షఫీ తనకు మంచి మిత్రుడని చిన్న జీయర్ స్వామి తెలిపారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరుల తో ముచ్చటించి వారి మెడలో రుద్రాక్ష మాల వేశారు. షఫీ కూతురు పెళ్లికి హాజరు కావడం ఆనందంగా ఉందని తెలిపారు. మతాల కన్నా మానవత్వం గొప్పది అన్నారు, భారత సంస్కృతి లో జీవన విధానం మతాలకతీతంగా ఉంటుందని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి తెలిపారు..

Leave A Reply

Your email address will not be published.