కరెంట్ షాక్ తో…పవన్ కళ్యాణ్ అభిమానులు మృతి.

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా చిత్తూరు జిల్లా కుప్పం.. శాంతిపురం మండ‌లం ఏడ‌వ‌మైలు గ్రామంలో అభిమానులు 25 అడుగుల ఎత్తుండే క‌టౌట్ క‌ట్టే ప్ర‌య‌త్నం చేశారు. ఆ స‌మ‌యంలో విద్యుత్ వైర్లు త‌గ‌ల‌డంతో ఒక్క‌సారిగా నిప్పులు చెల‌రేగి 10 మందికి విద్యుత్‌ఘాతం త‌గిలింది. ఈ ప్రమాదంలో సోమ‌శేఖ‌ర్‌, అరుణాచ‌ల‌నం, రాజేంద్ర అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయారు. విషయం తెలుసుకున్నపవన్ అభిమానుల మృతి ప‌ట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ప్రకటనను విడుదల చేశారు. విద్యుత్‌ఘాతంతో మృతి చెందిన అభిమానుల‌కు ఒక్కొక్క‌రికీ రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల ఆర్థిక‌సాయం అందించాల‌ని పార్టీ కార్యాల‌య సిబ్బందిని ఆదేశించిన‌ట్లు ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. అలాగే చికిత్స పొందుతున్న హ‌రికృష్ణ‌, ప‌వ‌న్‌, సుబ్ర‌హ్మ‌ణ్యం, అరుణ్‌కు సరైన వైద్యం అందేలా చూడాల‌ని స్థానిక నాయకుల‌ను కోరిన‌ట్లు ప‌వ‌న్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.