అమ్మాయిని బలవంతంగా ఆటోలో….

అనంతపురం జిల్లా : * తాడిపత్రి పట్టణంలో ఈరోజు రాత్రి 8 గంటల సమయంలో ఓ యువతిని ఆటో డ్రైవర్ బలవంతంగా తీసికెళ్తున్నట్లు అర్బన్ పోలీసు స్టేషన్లో అమ్మాయి తల్లి సమాచారం అందించింది. * సమాచారం అందిన గంటన్నరలోపే తాడిపత్రి పోలీసులు ఛేదించారు. * " హైఅలెర్ట్ " యాప్ నందు సదరు యువతి ఫోటో, వివరాలు అప్ లోడ్ చేసి పోలీసు అధికారులను జిల్లా వ్యాపితంగా అప్రమత్తం చేశారు. * తాడిపత్రి డీఎస్పీ ఆర్ల శ్రీనివాసుల ఆధ్వర్యంలో పట్టణ మరియు సమీప మండలాల పోలీసు అధికారుల గాలింపు చర్యలు చేపట్టారు. * పోలీసుల చాకచక్యంగా వ్యవహరించి హై అలెర్ట్ యాప్ ద్వారా సదరు యువతిని యల్లనూరు రోడ్డు శివారు ప్రాంతంలో ట్రేస్ చేశారు. * సురక్షితంగా ఉన్న ఆ యువతిని మహిళా పోలీసుల సంరక్షణలో ఉంచి బలవంతంగా ఆటోలో తీసికెళ్లిన విషయమై ఆరా తీస్తున్నారు. * విచారణలో వెలుగు చూసిన అంశాలు ఆధారంగా దర్యాప్తు కొనసాగించనున్నారు.

Leave A Reply

Your email address will not be published.