అనంతలో CT స్కాన్ సెంటర్ సీజ్ .!

అనంతపురం నగరంలో STAR DIAGNOSTICS ను సీజ్ చేసిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు.. జిల్లాలో కోవిడ్ నిర్ధారణకు సంబంధించి అవసరం లేకున్నా కొన్ని డయాగ్నిస్టిక్స్ సెంటర్లలో సి.టి.స్కాన్, ఇతర పరీక్షలను ఎక్కువగా చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో వాటిపై చర్యలు తీసుకుంటున్నాం : జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు కొన్ని డయాగ్నిస్టిక్స్ లో విచారణ చేయగా , రెఫరల్ లేకున్నా పరీక్షలు చేస్తున్నట్లు, అవక తవకలు జరుగుతున్నట్లు తేలింది : కలెక్టర్ నగరంలో రెండు డయాగ్నిస్టిక్స్ ల్యాబ్స్ ను మూసివేస్తున్నాం..మిగతా వాటికి షోకాజ్ నోటీస్ లు ఇస్తున్నాం: కలెక్టర్ మనమంతా సమిష్టిగా ఎదుర్కోవలసిన మహమ్మారి కోవిడ్..ఈ సమయంలో మానవతా దృక్పథంతో, వీలైతే తక్కువ మొత్తానికి పరీక్షలు చేయాలి:కలెక్టర్ అంతే కాని అవసరం లేని టెస్టులు చేయడం, ఎక్కువ డబ్బులు వసూలు చేయడం వంటి చర్యలకు పాల్పడరాదని విజ్ఞప్తి చేసిన కలెక్టర్ జిల్లాలో ప్రస్తుతానికి నగరంలో తనిఖీ చేస్తున్నామని, మిగిలిన అన్ని ప్రాంతాల్లో ని డయాగ్నిస్టిక్స్ ల్యాబ్స్ ను తనిఖీలు నిర్వహిస్తామని తెలిపిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు.

Leave A Reply

Your email address will not be published.