93 మంది మృతి.

అమరావతి: ఏపీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం బులెటిన్‌ విడుదల చేసింది. దాని ప్రకారం 24 గంటల వ్యవధిలో 46,712 నమూనాలను పరీక్షించగా 7,895 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఒక్కరోజులో రాష్ట్ర వ్యాప్తంగా 93 మంది మృతిచెందారు. నెల్లూరులో 16 మంది, పశ్చిమగోదావరి 13, చిత్తూరు 11, కర్నూలు 10, ప్రకాశం 9, కడప 8, శ్రీకాకుళం 6, విశాఖపట్నం 5, తూర్పుగోదావరి 4, అనంతపురం 3, గుంటూరు 3, కృష్ణా 3, విజయనగరం జిల్లాలో ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 3282కి చేరింది. ఇప్పటి వరకు 32,38,038 నమూనాలను పరీక్షించినట్లు రాష్ట్ర ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.