ముంబయిలో ముగిసిన రిషి కపూర్ అంత్యక్రియలు

  • ఈ ఉదయం కన్నుమూసిన రిషి కపూర్
  • ముంబయిలోని చందావాడీ శ్మశానవాటికలో అంత్యక్రియలు
  • కుటుంబసభ్యులతో పాటు కొందరు సెలబ్రిటీలు హాజరు

బాలీవుడ్ నట దిగ్గజం రిషి కపూర్ (67) ఇక సెలవంటూ మరో లోకానికి తరలి వెళ్లారు. కుటుంబ సభ్యులను, అభిమానుల శోకసంద్రంలో ముంచి ఈ లోకాన్నుంచి నిష్క్రమించారు. రిషి కపూర్ అంత్యక్రియలు ఈ సాయంత్రం 4 గంటలకు ముంబయిలోని చందావాడీ శ్మశానవాటికలో పూర్తయ్యాయి. ఈ అంత్యక్రియలకు కుటుంబ సభ్యులతో పాటు అతి కొద్దిమంది సెలబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు. రిషి కపూర్ భార్య నీతూ కపూర్, కుమారుడు రణబీర్ కపూర్, సోదరుడు రణధీర్ కపూర్, కరీనా కపూర్, ఆమె భర్త సైఫ్ అలీ ఖాన్, అలియా భట్, అభిషేక్ బచ్చన్, అనిల్ అంబానీ తదితరులు రిషి కపూర్ కు కన్నీటి వీడ్కోలు పలికారు. క్యాన్సర్ తో పోరాడుతూ రిషి కపూర్ ఈ ఉదయం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.