Home Telangana SDLC దూరవిద్య కేంద్రాన్ని గోదావరిఖనిలోనే కొనసాగించాలి- పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత

SDLC దూరవిద్య కేంద్రాన్ని గోదావరిఖనిలోనే కొనసాగించాలి- పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత

0
0

గత కొన్ని రోజుల నుండి తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమైన కాకతీయ యూనివర్సిటీ ద్వారా ఎస్ డి ఎల్ సి ఆధ్వర్యంలో నిర్వహించే స్టడీ సెంటర్ల ను తొలగిస్తుంది. UGC నిబంధనల ప్రకారం స్టడీ సెంటర్లను కొద్ది కుదిస్తున్నామని కాకతీయ యూనివర్సిటీ అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నిరుద్యోగ యువతకు, పరిసర ప్రాంత విద్యార్థులకు తీవ్ర నష్టం కలగనుంది. అధికారుల నిర్ణయం పట్ల దూర విద్య అందని ద్రాక్షగా మిగిలిపోనుంది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ద్వారా పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత గారి దృష్టికి తీసుకువెళ్లగా ఈరోజు ఢిల్లీలోని UGC ప్రధాన కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ ధీరేంద్ర పాల్ సింగ్ గారిని పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత గారు కలిసి ఎస్ డి ఎల్ సి దూర విద్యా కేంద్రాన్ని గోదావరిఖనిలో కొనసాగించాలని , ఈ దూర విద్యా కేంద్రాన్నివేరే చోటికి తరలించడం వల్ల పారిశ్రామిక ప్రాంత విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని అందువలన దూర విద్యా కేంద్రం గోదావరిఖని లోనే కొనసాగించాలని కోరారు.ప్రజానేత్ర రిపోర్టర్ లక్ష్మి నారాయణ పెద్దపల్లి..

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here