Home Telangana నేర నియంత్రణ కోసం LIVE SCANNAR ల వినియోగం

నేర నియంత్రణ కోసం LIVE SCANNAR ల వినియోగం

0
0

మెదక్ జిల్లా పోలీసు ప్రదాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి. శ్రీమతి చందన దీప్తి ఐ.పి.ఎస్. గారి ఆదేశానుసారం జిల్లా క్లూస్ టీమ్ ఆద్వర్యం లో జిల్లా రైటర్లకు నేరస్తుల వెలి ముద్రల సేకరణ పైన ఒక రోజు శిక్షణ కార్యాక్రమం నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా జిల్లా యెస్.పి గారు మాట్లాడుతూ….హత్య, దోపిడీ, దొంగతనాలు, లాంటి ,మొదలైన నేరాలు జరిగిన వెంటనే దర్యాప్తు అధికారి క్లూస్ టీం వచ్చేంత వరకు నేర స్థలంలోకి ఎవరిని అనుమతించకూడదని, జరిగిన నేరాన్ని ఛేదించాలన్నా..నిందితులకు శిక్ష పడాలన్నా క్లూస్ టీం ఘటనా స్థలంలో సేకరించిన శాస్త్రీయ ఆధారాలు అత్యంత కీలకం అని, క్లూస్ టీం లేకుండా ఏ కేసులోను మిస్టరీ విప్పలేం అని, ఏమైనా నేరాలు జరిగితే..వెంటనే అక్కడకు చేరుకుని వేగంగా శాస్త్రీయమైన ఆధారాలు సేకరించి, కేసుల దర్యాప్తులో వేగాన్ని పెంచేందుకు, నేరస్థులను పట్టుకునేందుకు క్లూస్‌ టీమ్‌ల సహాయ సహకారాలు ఎంతో అవసరమని అన్నారు. అలాగే ఏ పోలీసు స్టేషన్‌లో ఎలాంటి నేరం జరిగినా ఘటనా స్థలానికి క్లూస్ టీం వెళ్ళి ఘటనా స్థలంలో వేలి ముద్రలు, రక్తం మరకలు, తదితర ఆధారాలను క్షుణ్ణంగా సేకరించాలని వీటి ఆధారంగానే దర్యాప్తు అధికారులు నేరస్తులను సులభంగా పట్టుకోవచ్చని అన్నారు. మారుతున్నకాలానుగుణగా నేరస్తులు కూడా అత్యాదునిక పరిజ్ఞానాని ఉపయోగించి నేరాలకు పాపడుతున్నారని వారి ఆగడాలకు అడ్డుకట్టవేయటానికి పోలీసు శాఖ కూడా అత్యాదునిక సాంకేతిక పరిజ్ఞానాని ఉపయోగించి నేరస్తుల అటకట్టిస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగా జిల్లా క్లూస్ టీమ్ కి LIVE scanner లను అందించటం జరిగిందని వాటి ద్వారా ఘటనా స్థలంలో శాస్త్రీయ ఆధారాలను సేకరించి ఏదైనా నేరం జరిగినప్పుడు అనుమానితుల వెలి ముద్రలు సేకరించటం వల్ల ఆ నేరానికి సంబందించిన వివరాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన LIVE scanner అప్లికేషన్ లో నమోదు చేయటం ద్వారా ఆ నేరానికి సంబందించిన ఎవరైనా పాత నేరస్తులు కనుక ఉంటే క్షణాల్లో వారి వివరాలు వస్తాయని దానివల్ల నేరస్తులను పట్టుకోవటం సులభమవుతుందని అన్నారు. అలాగే ఈ పరికరం ద్వారా నేరాలను త్వరితగతిన ఛేదించవచ్చని, ఈ పరికరం ద్వారా పాత నేరస్తుల పూర్తి వివరాలు అనగా వేలిముద్రలు, ఫోటోస్ నేరస్థుడు ఏ రకమైన నేరం చేశాడు అనే అంశాలను నమోదు చేస్తామని అలాగే ఈ పరికరంలో దేశ వ్యాప్తంగా ఉన్న నేరస్తుల సమాచారం నిక్షిప్తం అయి ఉండటంవల్ల ఏదైనా నేరం జరిగినప్పుడు అనుమాననితుల వెలిముద్రలు ఇందులో తీయటం ద్వారా నేరస్తులను పోల్చుకోవచ్చని తద్వారా నేరస్తులను పట్టుకోవటం సులభమవుతుందని అన్నారు. ఇందులో భాగంగా జిల్లా రైటర్లకు ఈ LIVE scanner యొక్క పనితీరును ఒక రోజు శిక్షణలో భాగంగా నేర్పించటం జరిగిందని అన్నారు. ప్రస్తుతం జిల్లాలో 9 LIVE scanner లు అందించటం జరిగిందని, నేరాల నియంత్రణలో భాగంగా త్వరలో అన్నీ పోలీసు స్టేషన్ లకు ఈ LIVE scanner లను అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్లూస్ టీం ఏ.యెస్.ఐ. శ్రీ.అబ్దుల్ జునాయీద్ గారు,క్లూస్ టీం సబ్యులు శ్రీ.ఫయాజ్ గారు,శ్రీ.భూపాల్ గారు,శ్రీ. శ్రీధర్ గారు, జిల్లా రైటర్లు పాల్గొన్నారు.

మెదక్ ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ విజయ్ కుమార్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here