రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి కేసీఆర్ 30 శాతం ఫిట్మెంట్ ప్రకటించడం పట్ల, మంచిర్యాల మున్సిపాలిటీ 10వ
వార్డు అధ్యక్షుడు ఇనుముల దామోదర్ హర్షం వ్యక్తం చేశారు. అలాగే, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, హోం గార్డ్స్, అంగన్ వాడి, ఆశ వర్కర్లకు కూడా 30 శాతం ఫిట్మెంట్ ప్రకటించడం హర్షణీయం అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకున్నారని ఆయన పేర్కొన్నారు.
రిపోర్టర్ కోమల మనోజ్