చిన్నకోడూర్ పోలీస్ స్టేషన్ లో ఉన్న మోటార్ సైకిల్, ఆటో, కారు మొత్తం (19) వాహనాలను అన్నోన్ ప్రాపర్టీ గా పరిగణించి తేదీ 28-03-2021 ఆదివారం నాడు వేలం వేయబడును..సిద్దిపేట ఏసిపి రామేశ్వర్..
చిన్నకోడూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని (అన్నోన్ ప్రాపర్టీ గా) అబాండెడ్–మోటార్ సైకిల్-17, ఆటో-01, కారు-01, మొత్తం (19) వాహనాలను గతంలో 102 సీఆర్పీసీలో కేసు నమోదు చేసి వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటే పోలీస్ స్టేషన్ కు వచ్చి తీసుకుని వెళ్ళమని పత్రికా ప్రకటన ద్వారా ప్రజలకు తెలియ పరచడం జరిగింది. వాహనాల గురించి ఎవ్వరూ రానందున, పోలీస్ కమిషనర్ శ్రీ డి. జోయల్ డేవిస్ ఐపీఎస్., గారు మోటార్ సైకిళ్ళు వేలంపాట వేయడానికి కమిటీని ఏర్పాటు చేసినారు. కమిటీ చైర్మన్ సిద్దిపేట ఏసిపి రామేశ్వర్, సిద్దిపేట రూరల్ సీఐ సురేందర్ రెడ్డి, ఆర్ఐ రామకృష్ణ యంటిఓ, కమిటీ మెంబర్లు లను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ సిద్దిపేట ఏసిపి మాట్లాడుతూ చిన్నకోడూర్ పోలీస్ స్టేషన్ లో ఉన్న మొత్తం (19) వాహనాలను తేదీ: 28-03-2021 (ఆదివారం) నాడు ఉదయం 10 గంటలనుండి వేలం వేయబడతాయి, ఆసక్తి ఉన్నవారు వేలంపాటలో పాల్గొని వేలం వేయవచ్చు, వేలంపాటలో వాహనాలు దక్కించుకున్న వారు, వెంటనే డబ్బులు చెల్లించి వాహనాలు తీసుకొని పోవచ్చని ఏసీపీ రామేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు….. తాడూరి ముత్తేశ్ ప్రజానేత్ర న్యూస్ ఛానల్ రీపోటర్.