Home Telangana స్వతంత్ర భారత్ అమృత మహోత్సవాలు

స్వతంత్ర భారత్ అమృత మహోత్సవాలు

0
0

జయశంకర్ భూపాలపల్లి సమాజాన్ని జాగృతపరిచేవి కళలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. స్వతంత్ర భారత్ అమృత మహోత్సవాల్లో భాగంగా శనివారం సింగరేణి ఇల్లందు క్లబ్ హౌస్ లో అధికారికంగా నిర్వహించిన కవి సమ్మేళనo కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ జక్కు శ్రీ హర్షినితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వతంత్ర పూర్తి పై జిల్లాలోని 24 మంది కవులు కవితాగానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజాన్ని చైతన్యవంతం చేసే శక్తి కళలకు ఉందని అన్నారు.మంచి నైపుణ్యం గల కవులు,కళాకారులు జిల్లాలో అనేక మంది ఉన్నారని కవి సమ్మేళనం లాంటి కార్యక్రమాల ద్వారా వారిలో ఉన్న ప్రతిభాపాటవాలు సమాజానికి అవగతమవుతాయన్నారు. స్వాతంత్రోద్యమ కాలాన్ని మరియు స్వాతంత్ర ఫలాలను కళ్లకు కట్టినట్టుగా కవితల ద్వారా వినిపించారని ఈ కార్యక్రమంలో పాల్గొన్న కవులను అభినందించారు.జిల్లా పరిషత్ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని మాట్లాడుతూ మొదటిసారి ప్రత్యక్షంగా కవిసమ్మేళనం కార్యక్రమాన్ని చూస్తున్నానని, పాటల ద్వారానే తెలంగాణ ఉద్యమం ప్రజలలోకి బలంగా వెళ్లి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, తెలంగాణ రాష్ట్రంలో కవులకు,కళాకారులకు ప్రభుత్వం విశేష ఆదరణ కలిపిస్తుందని అన్నారు.జిల్లా సంయుక్త కలెక్టర్ కూరాకుల స్వర్ణలత మాట్లాడుతూ తెలుగుతనం ఉట్టిపడేలా కవి సమ్మేళనాన్ని నిర్వహించారని అధికారులను అభినందించారు. అనంతరం నగదు పురస్కారంతో పాటు జ్ఞాపికలను కవులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, మహదేవపూర్ ఎంపీపీ రాణిబాయి, టేకుమట్ల జెడ్పిటిసి పులి తిరుపతి రెడ్డి, డిపిఆర్ఓ రవికుమార్,డిబిసిడిఓ శైలజ, జిల్లా యువజన సర్వీసులు మరియు క్రీడల అభివృద్ధి అధికారి సునీత, తాసిల్దార్ ఇక్బాల్, కలెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ రవికుమార్, ఎంఈఓ దేవానాయక్, డిపిఆర్ఓ కార్యాలయ ఏవీఎస్ రాజు, కవులు, సాంస్కృతిక సారధి కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here