Home Telangana సైబర్ నేరగాళ్ల తో తస్మాత్ జాగ్రత్త – అదనపు ఎస్పి శ్రీ వి. శ్రీనివాసులు

సైబర్ నేరగాళ్ల తో తస్మాత్ జాగ్రత్త – అదనపు ఎస్పి శ్రీ వి. శ్రీనివాసులు

0
0

జయశంకర్ భూపాలపల్లి ప్రజలు సైబర్ నేరగాళ్లు చూపే మోసపూరిత ఆశలకు గురికావ డ్డని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ వి. శ్రీనివాసులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.సోషల్ మీడియాతో పాటు, ఓటీపీ ఫ్రాడ్, ఎనీ డెస్క్, OLX ఫ్రాడ్, జాబ్ ఫ్రాడ్, ఫేక్ ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ ద్వారా డబ్బులు పంపించమనడం లాంటి మోసాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అదనపు ఎస్పి గారు సూచించారు.ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా అనేక సైబర్ నేరాలు జరుగుతున్నాయని, వాటిపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు ఎక్కువయ్యాయని, ఎక్కువగా అంతర్రాష్ట్ర గ్యాంగులు సోషల్ మీడియా ద్వారా ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నారనీ, పేర్కొన్నారు. అమాయకులను నమ్మించి బ్యాంకు ఓటిపిల తస్కరణ ద్వారా బాధితుల బ్యాంకు ఖాతాలోని సొమ్మును దోచేస్తున్నారని, సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒక వేళ సైబర్ నేరాల బారిన పడినప్పుడు వెంటనే పోలీసులకు గాని, బ్యాంకు అధికారులకు గాని సమాచారం అందించాలని అదనపు ఎస్పి తెలిపారు.

సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- కొంతమంది షాపువారు డెబిట్/ క్రెడిట్ పిన్ కార్డును క్లోన్ చేసే వీలుందనీ, వీటి ద్వారా డూప్లికేట్ కార్డుని తయారుచేసి అకౌంట్ లోని డబ్బును దోచేస్తారు.
- మీ బ్యాంక్ ఖాతా వివరాల కోసం వచ్చే కాల్స్, ఈమెయిల్స్ కు స్పందించకండి.
- బ్యాంక్ సిబ్బంది మీ కార్డ్ నంబర్, పిన్, ఓటిపి, సివివి వివరాలను ఎప్పుడూ అడగరని గుర్తుంచుకోండి. ఒకవేళ అడిగితే వారు సైబర్ నేరగాళ్లని గుర్తించండి.
- బ్యాంక్ రేటు కంటే తక్కువ వడ్డీ రేటుకు లోన్స్ ఇస్తామంటే అనుమానించాలి. నమ్మిన వారిని వివిధ ఫీజుల పేరుతో నిండా ముంచేస్తారని గుర్తుంచుకోవాలి.
- షాపింగ్ చేసేటప్పుడు మీ క్రెడిట్/ డెబిట్ కార్డు పిన్ నంబర్ ను మీరే ఎంటర్ చేయండి. ఒకవేళ షాపు వారికి కార్డు ఇస్తే లావాదేవీ చేసే సమయంలో అక్కడే ఉండండి.
- ఆటోమేటెడ్ టెల్లింగ్ మెషిన్ (ఏటిఎం) సెంటర్లలో మీ పక్క, వెనక వారు మీ కార్డు వివరాలు సేకరించకుండా గమనించాలి. మీ కార్డు నంబర్, ఎక్స్ పైరీ డేట్, సీవీవీ నంబర్, పిన్ నంబర్ తెలుసుకుంటే మీ ఖాతాలో ఆన్ లైన్ షాపింగ్ చేసే వీలుంది.
- ఏటిఎం కార్డుకు ఫోన్ నంబర్ ను జత చేసుకోవాలి.
- కార్డు వివరాలను రహస్యంగా ఉంచుకోవాలి. పాస్ వర్డ్ ని ఎవరికీ చెప్పొద్దు.
- సైబర్ నేరగాళ్లు కంప్యూటర్ ద్వారా జరిగే లావాదేవీల వివరాలను తెలుసుకునేందుకు కీలాగర్స్ ను వాడుతున్నారు. నెట్ సెంటర్లలో కంప్యూటర్లను ఉపయోగించేటప్పుడు జాగ్రత్త వహించాలి.

- కొతమ౦ది క్రెడిట్ , డెబిట్ కార్డులు వెనుక పిన్ నె౦బర్ రాయట౦, పాస్ వర్డ్స్ పేపర్లలో రాసి పెట్టూకోవటo జరుగుతో౦ది. ఇది అత్య౦త ప్రమాద‍౦.
ప్రజలు సైబర్ నేరగాళ్ళు చూపే మోసపూరిత ఆశకు మోసపోకుండా తమ యొక్క కష్టార్జితాన్ని కాపాడుకోవడం కొరకు అలాగే సామాజిక మాధ్యమాల ద్వారా యువత చెడు దారి పట్టకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని అదనపు ఎస్పీ గారు సూచించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here