Home Telangana సిద్దిపేట నుండి ఇల్లంత కుంట వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి 254 కోట్లు మంజూరు

సిద్దిపేట నుండి ఇల్లంత కుంట వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి 254 కోట్లు మంజూరు

0
0

సిద్దిపేట నుండి ఇల్లంత కుంట వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి 254 కోట్లు మంజూరు..

– రెండు నియోజకవర్గాల రెండు మండల కేంద్రాలకు ప్రయాణానికి తీరిన ఇక్కట్లు..

– నెరవేరిన మంత్రి హరీష్ రావు , ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గార్ల విన్నపం , సీఎం కేసీఆర్ గారి అంగీకారం..

– చిన్నకోడూర్ మండలం లోని ఆరు గ్రామాల మీదుగా నాలుగు వరుసల రహదారి..

– ఆనందం వ్యక్తం చేస్తున్న రెండు నియోజకవర్గాల ప్రజలు..

సిద్దిపేట జిల్లా కేంద్రం నుండి సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంత కుంట మండల కేంద్రం వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి రూ.254 కోట్లు మంజూరు అయినట్లు మంత్రి హరీష్ రావు గారు తెలిపారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత డిసెంబర్ మాసం లో సీఎం కేసీఆర్ గారు సిద్దిపేట పర్యటన సందర్భంగా సిద్దిపేట ప్రాంతంలో రంగనాయక సాగర్, సిరిసిల్ల జిల్లాలోని అనంతగిరి రిజర్వాయర్ లు ఉన్నాయని రాబోయే రోజుల్లో గొప్ప పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి జరుగనున్నాయని సిద్దిపేట నుండి ఇల్లంత కుంట వరకు నాలుగు వరుసలు రహదారి కావాలని కోరడం జరిగిందని వెంటనే మంజూరు చేసారని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు.. ఈ నాలుగు వరసల రహదారి నిర్మాణం జరిగితే రెండు నియోజకవర్గాలు సిద్దిపేట , మానకొండూర్ ప్రజల ప్రయాణానికి సులభతరం కానుందన్నారు.. ఈ మార్గాన్ని వెడల్పు చేయడం వల్ల, సిద్దిపేట పట్టణం నుండి ఈ మార్గంలోని గ్రామాలకు రవాణా సౌకర్యాలు మెరుగు పడి, సిద్దిపేట పట్ణంలోని వైద్యశాలకు, విద్యాసంస్థలకు, వ్యవసాయ మార్కెట్ల లాంటి నిత్యం పనులుండే ప్రదేశాలకు రాకపోకలు సాగించడం చాలా సులువు అవడమే కాకుండా, సమయం కూడా తగ్గుతుంది, రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గుతాయి. రైతులకు , విద్యార్థులకు కూడా రోడ్డుమీద ప్రయాణ సమయం తగ్గుతుంది. సిద్దిపేట పట్టణం ఎల్లమ్మ టెంపుల్ నుండి పెద్దకోడూర్ , చిన్నకోడూరు మండలంలోని చిన్నకోడూర్ మండల కేంద్రం , సలంద్రి , కమ్మర్ల పల్లి, మైలారం , అల్లిపూర్ , కిష్టాపూర్ జంక్షన్ మీదుగా సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంత కుంట మండలం కేంద్రం వరకు 32 కిలోమీటర్లు ఈ రహదారి నిర్మాణం జరుగుతున్నట్లు చెప్పారు..

– భవిష్యత్ చూపు.. రహదారి నిర్మాణం…

– నెరవేరిన మంత్రి హరీష్ రావు , ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గార్ల విన్నపం , సీఎం కేసీఆర్ గారి అంగీకారం..

– 32 కిలోమీటర్లు , 254 కోట్లు నాలుగు వరుసల రహదారి నిర్మాణం …

– హర్షం వ్యక్తం చేస్తున్న రెండు నియోజకవర్గాల ప్రజలు..

భవిష్యత్ చూపు దృష్ట్యా …రహదారి నిర్మాణం చెప్పట్టాలి అని మంత్రి హరీష్ రావు గారు సిద్దిపేట పర్యటన కు వచ్చిన సీఎం కేసీఆర్ గారికి సిద్దిపేట నుండి సిద్దిపేట ప్రాంతం లో కొంతభాగం కలిసే అనంతగిరి రిజర్వాయర్ వరకు నాలుగు వరుసలు రోడ్డు కావాలని విన్నవించారు.. అదేవిధంగా సిద్దిపేట ఇల్లంతకుంటకు రాకపోకలు ఎక్కువగా ఉంటాయి అని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కోరారు అందుకు సీఎం కేసీఆర్ గారు అంగీకరించారు.. ఉత్తర్వులు జారీ చేశారు.. రాబోయే రోజుల్లో గొప్ప పర్యాటక ప్రాంతంగా రంగనాయక సాగర్ కోబోతుందని పర్యాటకుల రద్ధి పెరిగే అవకాశం ఉన్నందున ఈ నాలుగు వరుసల మార్గం ప్రజల ప్రయాణం సులువు కానుంది.. 32 కిలో మీటర్ల మార్గం , పట్టణ కేంద్రం లోని ఒక గ్రామం , చిన్నకోడూర్ మండలము లోని 6 గ్రామాలను అనుసంధానం చేస్తూ.. అదేవిధంగా సిద్దిపేట రూరల్ మండలం లోని బుస్సాపూర్ , నంగునూర్ మండలం లోని తిమ్మాయ్ పల్లి రింగ్ రోడ్డు కు అనుసంధానం కావడం, అదేవిధంగా చిన్నకోడూర్ మండలం కిష్టా పూర్ జంక్షన్ వద్ద బెజ్జంకి మండల కేంద్రం కు అనుసంధానం , ఇల్లంత కుంట వరకు జరిగే ఈ మార్గం ఇల్లంత కుంట నుండి కరీంనగర్ , సిరిసిల్ల కు కూడా అనుసంధానం అవుతుంది.. ఈ సందర్భంగా రెండు నియోజకవర్గ ప్రజలకు ప్రయాణానికి మేలు జరగనుంది , ఒక వరుస రహదారి నుండి నాలుగు వరుసల రహదారి నిర్మాణం కావడం పట్ల ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు….. తాడూరి ముత్తేశ్ ప్రజానేత్ర న్యూస్ ఛానల్ రీపోటర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here