Home Telangana సింగరేణి అభివృద్ధి కి సహకారం చేస్తాం.. జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య

సింగరేణి అభివృద్ధి కి సహకారం చేస్తాం.. జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య

0
0

జయశంకర్ భూపాలపల్లి సింగరేణి సంస్థ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో సింగరేణి భూపాలపల్లి ఏరియా జిఎం నిరక్షన్ రాజ్ జిల్లా కలెక్టర్ ను కలిసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగరేణి సంస్థ సాధించిన ప్రగతిపై రూపొందించిన ”తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి అద్భుత ప్రగతి” పుస్తకమును జిల్లా కలెక్టర్ కు అందించి సింగరేణి అభివృద్ధికి మరియు కార్మికుల సంక్షేమం కోసం సంస్థ తీసుకుంటున్న చర్యలను వివరించారు. అలాగే సింగరేణి సంస్థ విస్తరణకు చేపట్టిన భూసేకరణ కార్యక్రమంపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూపాలపల్లి ఏరియాలో సింగరేణి సంస్థ అభివృద్ధికి జిల్లా అధికార యంత్రాంగం ఎప్పుడు పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని,సంస్థలోని కార్మికుల సంక్షేమానికి యాజమాన్యం అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.కరోన వ్యాప్తి అధికమవుతున్నందున గనులపై కార్మికులను అప్రమత్తం చేయాలని, ఎండాకాలం ఎండల తీవ్రత దృష్ట్యా కార్మికులకు ఇబ్బంది కలగకుండా తగు రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే సింగరేణి సంస్థ షేప్ నిధులతో పరిసర ప్రాంత అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. సింగరేణి గనుల విస్తరణకు అవసరమైన భూసేకరణ కార్యక్రమాన్ని వేగవంతం చేసి సంస్థకు ఇబ్బంది కలుగకుండా భూమిని అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ టు జిఎం విజయ్ ప్రసాద్, ఫైనాన్స్ మేనేజర్ అనురాధ, ఎస్టేట్ ఆఫీసర్ బాబుల్ రాజ్, ఎస్టేట్ మేనేజర్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here