Home Telangana సరిహద్దు సమస్య పరిష్కరించకుండా ఎన్నికలకు వెల్లద్దు -గొల్లపల్లి గ్రామస్తులు

సరిహద్దు సమస్య పరిష్కరించకుండా ఎన్నికలకు వెల్లద్దు -గొల్లపల్లి గ్రామస్తులు

0
0

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలము గొల్లపల్లి గ్రామ పంచాయితీ లో సరిహద్దు సమస్య ను పరిష్కరించకుండా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయవద్దని ఒక్కవేళ సమస్య పరిష్కరించకుండా అధికారులు నోటిఫికేషన్ విడుదల చేస్తే ఎన్నికలను బహిష్కరించలని గొల్లపల్లి గ్రామ ప్రజలు ఈ రోజు ఏకగ్రవంగా తీర్మానం చేసుకున్నారు,
గతంలో రెండు సార్లు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన గ్రామంలో 148 మంది ఓటర్లును తమకు సంబంధించిన ఇండ్ల స్థలాలను, వ్యవసాయ భూములను కొత్తగా ఏర్పాటు చేసిన వెంకట్రావుపల్లి గ్రామ పంచాయతీ లో అన్యాయంగా కలిపారని దాని కారణంగా నామినేషన్ వేయకపోవడంతో ఇప్పటి వరకు గ్రామపంచాయతీ కి సర్పంచ్ లేడు అనే విషయం అందరికి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న గౌరవ మండల అధ్యక్షులు ఊట్కూరి వెంకట రమణ రెడ్డి అక్కడకి చేరుకొని గౌరవ శాసన సభ్యులు *రసమయి బాలకిషన్ * దృష్టి కి తీసువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో అన్ని కుల సంఘాల అధ్యక్షులు మహిళ సంఘాల సభ్యులు, రైతులు, యువజన సంఘం నాయకులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..
బొల్లం సాయిరెడ్డి మండల్ రిపోర్టర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here