Home Telangana సఖి కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

సఖి కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

0
0

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, రెబ్బెన మండలం లోని పులికుంటా, తకాలపల్లి,కైరిగం గ్రామాలలో సఖి ఖేంద్రం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా సఖి కేంద్రం సైకో సోషల్ కౌన్సెల్లొర్ మమత మాట్లాడుతూ బాధిత మహిళలకు భరోసా కేంద్రంగా సఖి కేంద్రం 24 గంటలు అందుబాటులో ఉంటుంధని అన్నారు.హింసకు గురైన శారీరక మానసిక గాయాలపాలైన మహిళలు సఖి కేంద్రమును ఆశ్రయించి వైద్య సదుపాయం పొందవచ్చునని అన్నారు.సఖి కేంద్రమునకు రాలేని బాధితుల కోసం 181 వాహన సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.సఖి కేంద్రంలో భార్య,భర్తలకు ఫ్యామిలీ కౌన్సెలింగ్ సేవలు,పోలీస్ సేవలు,న్యాయ సేవలు పొందవచ్చునని పేర్కొన్నారు. సఖి కేంద్రమునకు బాధిత మహిళలు వినియోగించుకొని లబ్ధి పొందవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేస్ వర్కర్ మౌనిక,పరమెడికల్ హారిక ప్రవీణ్, ఆ గ్రామాలలోని సర్పంచులు, ఉప సర్పంచుల,అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.
ప్రజానేత్ర రిపోర్టర్:తిరుపతి, రెబ్బెన మండలం,ఆసిఫాబాద్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here