Home Telangana రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

0
0

జయశంకర్ భూపాలపల్లి, వరి ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం సిఎస్ సంబంధితశాఖల ఉన్నత అధికారులతో కలిసి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పనుల్లో పురోగతి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు, నర్సరీలలో మొక్కల పెంపు, ధరణి, కోవిడ్-19, పట్టణాల్లో సమీకృత వెజ్ & నాన్వెజ్ మార్కెట్ ఏర్పాటు, వరి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై సమీక్షించి తగు ఆదేశాలు జారీచేశారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నందున వరి ధాన్యం అమ్ముకోవడానికి రైతులకు ఇబ్బంది కలగకుండా గత సంవత్సరంలో మాదిరిగానే జిల్లా వ్యాప్తంగా గ్రామస్థాయిలో వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించినందున వెంటనే అన్ని జిల్లాలలో గ్రామస్థాయిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సిస్టమేటిక్ గా పరి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. ఇప్పటికే చాలావరకూ పల్లె ప్రగతి పనులు పూర్తయ్యాయని పెండింగ్లో ఉన్న మిగతా పనులను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. వర్షాకాలంలో నాటేందుకు గ్రామపంచాయతీలో ఏర్పాటుచేసిన నర్సరీలలో మొక్కలు ఆరోగ్యవంతంగా పెంచాలన్నారు. హరితహారం కార్యక్రమం ద్వారా నాటిన మొక్కలు ఎండిపోకుండా నీరు పోయాలన్నారు. ఉపాధి హామీ పనులు నిర్వహించేందుకు ఇది సరైన సీజన్ కాబట్టి ప్రతి గ్రామంలో ప్రతిరోజు కనీసం 100 మంది కూలీలు పని చేసేలా స్వయం ఉపాధి పనులను నిర్వహించాలన్నారు. కరోనా వైరస్ అధికమవుతున్నందున ప్రజలను అప్రమత్తం చేసి కోవిడ్-19 నిబంధనలను అమలు చేసి, కరోనా టెస్టులను పెంచి వైరస్ బారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఈ వ్యాధికి గురైన వారికి చికిత్స అందించేందుకు ఆస్పత్రిలో అవసరమైన పరికరాలను సమకూర్చుకోవాలని,వ్యాక్సినేషన్ ప్రక్రియ సమర్థవంతంగా చేపట్టాలన్నారు, ధరణి పోర్టల్ ను మరింత సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. పట్టణాలలో రెండు ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ వెజ్ మరియు నాన్ వెజ్ మార్కెట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. మున్సిపాలిటీలలో ఫ్లికల్ స్లెడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా సంయుక్త కలెక్టర్ కూరాకుల స్వర్ణలత, ఆర్డీవో శ్రీనివాస్, డిపిఓ ఆశాలత, డిఆర్డిఓ పురుషోత్తం, డిఎఓ విజయ్ భాస్కర్, జిల్లా పౌరసరఫరాల అధికారి గౌరీ శంకర్, పౌరసరఫరాల మేనేజర్ రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here