Home Telangana రైతులకు ఇబ్భంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి

రైతులకు ఇబ్భంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి

0
0

జయశంకర్ భూపాలపల్లి,
• గోదాముల సామర్థ్యం చూసుకోవాలి
• తాలు లేకుండా తేవాలి, తేమ శాతం 17 శాతం దాటకుండా చూసుకోవాలి
• తూకం వేసిన తర్వాత మిల్లర్ల దగ్గర ఆగకుండా, వారు కోత పెట్టకుండా అధికారులు చూసుకోవాలి
• గోనె సంచులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి
• కోవిడ్ మళ్లీ విజృంభిస్తుంది…దీనిపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
• ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల ఆఖరి ఆయకట్టు వరకు నీరు వెళ్లాలి
• కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాల ద్వారా మార్కెట్లు ఉంటాయా? లేదా ? ఆందోళన ఉన్నా 20వేల కోట్లరూపాయలు సివిల్ సప్లయిస్ కు సిఎం కేసిఆర్ గారు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చారు.
• ములుగు, భూపాలపల్లి జిల్లాల సమీక్షలో రాష్ట్ర మంత్రలు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీమతి సత్యవతి రాథోడ్.
ఈ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు తను పండించిన పంటను అమ్మడంలో ఇబ్బంది పడకూడదని దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఊరూరా పెట్టి పంటను కొంటున్నారని రాష్ట్ర మంత్రులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీమతి సత్యవతి రాథోడ్ లు చెప్పారు. గత సంవత్సరం కోవిడ్ కష్టకాలంలోనూ పంటను కొనుగోలు చేసి, ఈసారి కేంద్రం మార్కెట్లు, కొనుగోలు కేంద్రాలు పెట్టబద్దని చెబుతున్నా…రైతుల సంక్షేమమే లక్ష్యంగా సిఎం కేసిఆర్ గారు పనిచేస్తున్నారని అన్నారు. ఈసారి ధాన్యం కొనుగోలు కోసం 20వేల కోట్ల రూపాయలను పౌర సరఫరాల శాఖకు బ్యాంక్ గ్యారంటి ఇచ్చారన్నారు.
ములుగు, జయశంకర్ భూపాలజిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఇరిగేషన్, కోవిడ్ -19, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఆర్.ఓ.ఎఫ్.ఆర్ లపై మంత్రులిద్దరు సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులతో నేడు ములుగు జిల్లాలోని కలెక్టరేట్ లో సమీక్ష చేశారు. గత ఏడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి రవాణా సదుపాయాలలో లోటు లేకుండా , గోనె సంచుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. అదేవిధంగా గోదాముల సామర్థ్యం, పంట దిగుబడికి తగ్గట్లుగా ఉండే విధంగా చూసుకోవాలన్నారు. రైతులు తమ ధాన్యాన్ని తాలు లేకుండా, తేమ శాతం 17 మించకుండా ఉండేలా చూసుకోవాలని విజ్ణప్తి చేశారు.
రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన తర్వాత అక్కడ రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని, తూకం వేయడంలో, వేసిన తర్వాత అక్కడ ఆగకుండా మిల్లర్లతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. రైతుల ధాన్యాన్ని తాలు, తేమ పేరుతో కోత విధించకుండా మిల్లర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని అధికారులకు సూచించారు.గత ఏడాది కోవిడ్ వల్ల లాక్ డౌన్ విధించి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నామని, మళ్లీ ఈసారి కూడా కోవిడ్ విజృంభిస్తోందని, ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధికారులు కోవిడ్ నేపథ్యంలో అన్ని విధాల సేవలు అందించేందుకు సంసిద్ధంగా ఉండాలని సూచించారు. అలాగే మాస్క్ ధరించకుండా పబ్లిక్ లోకి వస్తున్నా వ్యక్తులకు జరిమానా (పైన) విదించాలని , లేనిచో కోవిడ్ నియంత్రణ కష్ట తరం అవుతుందని వారు అన్నారు.ముఖ్యమంత్రి కేసిఆర్ గారు సాగునీటి విషయంలో ఇప్పటికే తెలంగాణను గొప్పగా తీర్చదిద్దారని, ములుగు జిల్లా, జయశంకర్ భూపాలపల్లిలో కూడా ఆఖరి ఆయకట్టు వరకు నీరు అందేలా గతంలో చేసిన ప్రణాళికలు అమలు జరిగేటట్లు చూడాలన్నారు. ముఖ్యమంత్రి గారు వచ్చే ఆరు నెలల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు పూర్తి చేయాలని ఆదేశించిన నేపథ్యంలో మార్కెట్ల పనులు వేగవంతం చేయాలన్నారు.ఈ సందర్భంగా ములుగు జిల్లా శాసన సభ్యురాలు దనసరి అనసూయ(సీతక్క) గారు మాట్లాడుతూ ,జిల్లాలో సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయం నిర్మాణానికి 55 కోట్లు కేటాయించి నందున ఆనందం వ్యక్తం చేశారు. బస్టాండ్ ,బస్సు డిపోల పైన ద్రుష్టి సారించాలని వారు అన్నారు. ములుగు జిల్లాను టూరిజం హబ్ గా తీర్చి దిద్దాలని వారు అన్నారు. రైతులకు కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు పక్రియ సవ్యంగా జరిగేల అన్ని ఏర్పాట్లు సంబందిత అధికారులు చర్యలు తీసుకోవాలి అని వారు అన్నారు. సమీక్షకు ముందు ములుగు జిల్లా గట్టమ్మ దేవాలయంలో పూజలు చేశారు. అనంతరం సంచార చేపల విక్రయ వాహానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య గారు మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ -19,కొనుగోలు కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో మరియు మీటింగ్ లో చర్చిన అంశాల పైన సంబందిత అధికారులతో చర్చించి రైతులకు, ప్రజల సమస్యల పై పరిష్కరించుటకు కృషి చేస్తానని వారు అన్నారు.ఈ సమావేశంలో జయశంకర్ భూపాలపల్లి జెడ్పి చైర్ పర్సన్ జక్కు శ్రీ హర్షిని, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, ములుగు శాసన సభ్యురాలు సీతక్క, జిల్లా అదనపు కలెక్టర్ లు ఆదర్శ్ సురభి,స్వర్ణలత , ఫారెస్ట్ డివిజన్ అధికారిని నిఖిత IFS, ITDA PO హన్మనతు కె జడంగే,ఎఎస్పి సాయి చైతన్య గారు, సంబందిత అధికారులు,రైతు సమన్వయ కో ఆర్డినేటర్ పళ్ళ బుచ్చయ్య . ఇతర ప్రజా ప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here